కిమి వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kimi Verma.jpg
కిమి వర్మ

కిమి వర్మ ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్.[1] బాంబే విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదివిన తరువాత ఆమె లాస్ ఏంజిలెస్ కు మారిపోయారు. ప్రస్తుతం కూడా ఆమె అక్కడే నివసిస్తున్నారు. ఆమెకు స్వంతంగా స్త్రీల ఫ్యాషన్ హౌస్ ఉంది. ఆ కంపెనీకి లీడ్ డిజైనర్, సి.ఈ.వోగా కిమీ పనిచేస్తున్నారు.

1994లో మిస్ బాంబే,[2] ఫెమినా మిస్ ఇండియా బ్యూటిఫుల్ హైర్ టైటిల్స్ ను గెలుచుకున్నారు. చాలా పంజాబీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆమెకు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ లో వస్త్రాల డిజైనర్ గా పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1977 నవంబరు 20న పంజాబ్లో జన్మించారు కిమి. పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టారామె. పంజాబ్ లో పుట్టినా ఆమె చదువు ముంబైలో సాగింది. బాంబే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ పట్టా అందుకున్నారు కిమి. ఆ తరువాత ఆమె కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ కు మకాం మారిపోయారు ఆమె. ప్రస్తుతం లాస్ ఏంజలస్ లో లేడీస్ ఫ్యాషన్ హౌస్ నడుపుతున్నారు కిమి. ఆ కంఫెనీకి సి.ఈ.వో గానే కాక, లీడ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఆమె. కిమి మోడల్ గానూ, నటిగానూ కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు. అన్నీ పంజాబీ సినిమాలే చేశారు కిమి.

కెరీర్[మార్చు]

నసీబో(1994)లో ఒక పాత్రతో తెరంగేట్రం చేశారు కిమి. ఆ తరువాత కహర్(1997), జీ ఆయున్ ను, అసును మాన్ వత్నా డా, మేరా పిండ్-మై హోం వంటి పంజాబీ సినిమాల్లో నటించారామె. కొన్ని టివి సీరియల్స్ లోనూ, మోడల్ గానూ కూడా పనిచేశారు కిమి.

సినిమాలు[మార్చు]

 • 1994 - నసీబో
 • 1997 - కహర్
 • 2000 - షాహీద్ ఉదమ్ సింగ్
 • 2002 - జీ ఆయన్ ను
 • 2004 - అసను మాన్ వత్నా డా
 • 2008 - మేరా పిండ్-మై హోమ్
 • 2009 - సాత్ శ్రీ అకల్
 • 2010 - ఇక్ కుడీ పంజాబీ డీ
 • 2012 - అజ్ డీ రంఝే

మూలాలు[మార్చు]

 1. "An Actress With Zest for Life". The Tribune. 2003.
 2. ""...my blood also becomes a part of Sat Sri Akal..." - Kimi Verma (an interview)". Planet Bollywood. Retrieved 5 November 2010.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కిమి_వర్మ&oldid=3903664" నుండి వెలికితీశారు