Jump to content

కిరోబో

వికీపీడియా నుండి
కిరోబో

కిరోబో అనునది జపాన్ దేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యోమ రోబోట్.

విశేషాలు

[మార్చు]
  • ఎర్రని కాళ్లతో చిన్ని రూపంతో ఉండే ఈ మర మనిషి పేరు కిరోబో . కిలో బరువు, 13 అంగుళాల పొడవుంటుందిది.[1] ఇది చరిత్ర లోనే మొదటి సారిగా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి మనుషులతో మాట్లాడింది . అందుకే భూమి నుంచి అత్యంత ఎత్తుకు వెళ్లి, రోదసీలో మాట్లాడిన మొదటి రోబోట్‌గా దీనికి రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయి.[2]
  • ఇది అంతరిక్షంలోకి వెళ్లింది 2013 ఆగస్టులో. జపాన్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లింది. అందులో పనిచేసే శాస్త్రవేత్తలకు ఇన్నాళ్లు చేదోడుగా ఉంది. అక్కడ వ్యోమగామి కౌచీ వాకాటతో సంభాషించి ఆశ్చర్యపరిచింది. నువ్వు ఎవరు? ఎలా వచ్చావు? అంటే బదులుగా నేను రోబోట్‌ను, తనేగాషిమా నుంచి కైనోటోరి రాకెట్‌లో వచ్చాను అని సమాధానం చెప్పింది.
  • మనిషి రూపంలో ఉండే ఈ కిరోబోని టోక్యో విశ్వవిద్యాలయం, టయోటా కంపెనీ వాళ్లు కలిసి తయారు చేశారు. ముఖ్యంగా వ్యోమగాములకు ఆహ్లాదం కలిగిస్తూ, మానసికంగా సాయపడాలనే ఉద్దేశంతోనే కిరోబోను చేసి రోదసీ లోనికి పంపారు.[3]
  • కిబో, రోబో అనే రెండు పదాలు కలిసి కిరోబో అని పేరు పెట్టారు. కిబో అంటే జపాన్ భాషలో నమ్మకం అని అర్థం.[4][5]
  • దీంట్లో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోబోట్ జపనీస్ మాట్లాడేస్తుంది. ముఖాలు, గొంతులు గుర్తుపడుతుంది.[6]
  • గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశంలోనూ ఇది భూమిపై ఉన్నట్లే ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "KIBO ROBOT PROJECT". Archived from the original on 2013-07-01. Retrieved 2013-07-01.
  2. Kevin Lynch (2015-03-27). "Robot astronaut Kirobo sets two Guinness World Records titles". Guinness World Records Ltd. Retrieved 2015-03-30.
  3. Steven Bogos (2013-06-30). "The Escapist : News : Kirobo Will be Japan's First Robot Astronaut". The Escapist. Archived from the original on 2015-01-15. Retrieved 2013-07-01.
  4. "Little Kirobo to Become First Robot Space Talker | Space". TechNewsWorld. 2013-06-27. Archived from the original on 2013-07-02. Retrieved 2013-07-01.
  5. "World's first talking robot set to go into space | Mail Online". Daily Mail. 2013-06-27. Retrieved 2013-07-01.
  6. "Kirobo Robot Is Japan's New, Exceptionally Cute Robot Astronaut (PICTURES) (VIDEO)". Huffington Post. 2013-06-27. Retrieved 2013-07-01.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కిరోబో&oldid=3830434" నుండి వెలికితీశారు