కిలోవాట్ అవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన ఇండ్లలో ఉపయోగించే విద్యుత్ సాధనాలు వినియోగించుకునే విద్యుచ్చక్తిని, మీటరు నమోదు చేస్తుంది. ఒక నిర్ణీత కాలంలో వినియోగమయిన విద్యుచ్చక్తిని నమోదు చేయాలంటే ఈ మీటరు యొక్క, తొలి, తుది రీడింగులను నమోదు చేయాలి. ఈ రెండు రీడింగుల భేదము ఆ నిర్ణీత కాలంలో వినియోగమైన విద్యుచ్చక్తి ప్రమాణాలను తెలుపుతుంది.

యిండ్లలో వాడబడుతున్న మీటర్ రీడింగ్ ప్రమాణం "యూనిట్" అంటే కిలో.వాట్.అవర్
విద్యుత్ సాధనం వినియోగించుకొనే విద్యుచ్ఛక్తి, ఆ సాధన వాటేజ్ పైన దానినిఉపయోగించిన కాలవ్యవధి పైన ఆధారపదుతుంది.
విద్యుచ్ఛక్తి = సామర్థ్యం X కాలం=వాట్ .సెకనులు
1 వాట్ అవర్ = 1 వాట్ X 1 గంట
1 వాట్ అవర్ = 1 వాట్ X 60 X 60 సెకనులు
1 వాట్ అవర్ = 3600 వాట్.సెకనులు

1 కిలో వాట్ అవర్ = 1000 వాట్ అవర్స్
1 కిలో వాట్ అవర్ = 1000 X 3600 వాట్ సెకనులు.
మీ విద్యుత్తు బిల్లులో చూపబడిన నెలసరి వాడుక ప్రమాణాల సంఖ్య మీరు ఉపయోగించిన (యూనిట్లు) లను సూచిస్తుంది.