కీర్తిగా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కీర్తిగా రెడ్డి ఫేస్‌బుక్ ఇండియా హెడ్.

బాల్యం, విద్య[మార్చు]

కీర్తిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ల నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. దాంతో నాలుగు సంవత్సరాలకోసారి ఊరు మారాల్సి వచ్చేది. ముంబై, చెన్నై ఇలా రాష్ర్టాలు దాటాల్సి వచ్చేది. ఏ ఊరికి వెళ్లినా స్కూల్ మాత్రం దగ్గరగా ఉండేలా చూసేవాళ్లు తల్లిదండ్రులు. స్కూల్ దగ్గరుంటే.. ఎక్కువగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని వాళ్ల నమ్మకం. నాందేడ్‌లోని ఎమ్‌జీఎమ్ కాలేజ్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత తండ్రికి నాగ్‌పూర్ షిప్ట్ అవ్వడంతో మకాం అక్కడికి మారింది. అక్కడ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూనే జీమ్యాట్‌కి ప్రిపేరైంది. వీళ్ల ఫ్యామిలీ నుంచి టెక్నికల్ అండ్ బిజినెస్ డిగ్రీ చేయడానికి యూఎస్ వెళ్లిన మొదటి వ్యక్తి కీర్తినే! ఎమ్‌ఎస్ కంప్యూటర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టాన్‌ఫార్డ్ యూనివర్సిటీలో, ఇంజినీరింగ్‌ని సైరాస్యూస్ యూనివర్సిటీలో పూర్తి చేసింది.

ఉద్యోగ జీవితం[మార్చు]

చదువుతూనే జాబ్ ట్రయల్స్ మొదలుపెట్టి సిలికాన్ గ్రాఫిక్స్‌లో అడుగుపెట్టింది. అక్కడ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో యంగ్ డైరెక్టర్. అంతేకాదు.. టీమ్‌లో ఒకగానొక్క మహిళ కూడా! ఆ తర్వాత మోటరోలా కంపెనీలో జాయిన్ అయింది. అయితే అసైన్‌మెంట్ కోసం 18 నెలలు ఇండియాకు తిరిగి వచ్చింది. అప్పటికే ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అప్పుడే ఫేస్‌బుక్ ఆఫర్ వచ్చింది. మొదట ఎంప్లాయ్‌గానే చేరింది. ఆ తర్వాత సీఈఓ స్థానాన్ని సంపాదించుకుంది. గత సంవత్సరం దాకా హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేసి, ప్రస్తుతం ముంబైలో ఉంటోంది.

గూగుల్, యూట్యూబ్, ఎమ్‌ఎస్‌ఎన్, యాహూ.. వీటన్నిటితో పోలిస్తే.. ఫేస్‌బుక్‌లో చాటింగ్‌కి టైమ్ స్పెండ్ చేసేవాళ్లు ఎక్కువ. స్టూడెంట్స్, హోమ్‌మేకర్స్ కూడా దీనికి అడిక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్క విషయాన్ని అప్‌డేట్ చేస్తూ అందరికంటే ముందు ఉండాలనే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇంతలా దీన్ని ఇష్టపడే వారి సంఖ్య పెరగడానికి వెనుక కీర్తిగా రెడ్డి కృషి ఎంతో ఉంది. ఒక్క సంవత్సరంలో ప్రభంజనం సృష్టించింది. పెద్ద బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ వరకు యాడ్స్ రూపంలో తీసుకొచ్చింది. టీమ్‌వర్క్‌తో ముందుకు సాగి సక్సెస్ సాధించింది. ఫార్చూన్ టాప్ 50 పవర్‌ఫుల్ ఉమెన్ ఇండియా లిస్ట్‌లో టాప్ 25 స్థానాన్ని దక్కించుకుంది.

మూలాలు[మార్చు]

| నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో కీర్తిగా రెడ్డి గురించి ప్రచురితమైన కథనం

ఇతర లింకులు[మార్చు]