కుందూరు సత్యనారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుందూరు సత్యనారాయణ రెడ్డి(K.S.Narayana Reddy) న్యాయ సంబంధ వైద్య శాస్త్రవేత్త. ఆయన మహబూబ్‌నగర్ లోని ఎస్.వి.ఎస్ మెడికల్ కళాశాలలో ఫోర్సెనిక్ విభాగంలో గౌరవ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో 1931 ఆగస్టు 4 న జన్మిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలొ ఎం.బి.బి.ఎస్. చదివారు. ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి డి.సి.సి., ఎం.డి పట్టాను పొందారు

ఉస్మానియా మెడికల్ కళాశాల, హైదరాబాదు లో తొలుత జనరల్ డాక్టరుగా 1955 నుండి 1958 వరకు పనిచేసారు. 1959-64 మధ్యకాలంలో ట్యూటర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసరుగానూ, 1965-82 ల మధ్య ఫోరెన్‌సిక్ మెడిసన్ విభాగపు ప్రొఫెసరుగానూ, 1983 - 89 మధ్య ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాలుగా పదవీభాధ్యతలు నిర్వహించి పదవీవిరమణ చేసారు.

అకాడామీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అకాడమీ ఆఫ్ ఫోరెన్‌సిక్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ మొదలగు ప్రసిద్ధ వైద్య సంస్థల ఫెలోషిప్ లను అందుకొని అవిరామ పరిశోధనలు చేసారు. ఆయన దేశస్థాయిలో ఫోరెన్‌సిక్ మెడిసన్ (న్యాయసంబంధ వైద్యం) రంగంలో ఎంతో ప్రామాణికమైన పరిశోధనా గ్రంథాలను వెలువరించిన ఘనత పొందారు. ప్రత్యేక పరిశోధనలు చేసి, ఈ రంగంమీద సాధికారిత పొందిన వారిలో అగ్రగామిగా నిలిచారు.[2] ఆయన జాతీయ అంతర్జాతీయ ప్రముఖ వైద్య పరిశోధనా పత్రికలలో 30 పరిశోధనా పత్రాలను, వైజ్ఞానిక రచనలను వెలువరించాయి.

రాసిన గ్రంథములు[మార్చు]

  • Forensic Medicine (1970)
  • Essentials of Forensic Medicine and Toxicology (1985)[3]
  • The Synopsis of Forensic Medicine and Toxology (1986)[4]
  • Medico-Legal Manual

పురస్కారాలు[మార్చు]

ఆయనకు పలు గౌరవ పదవులు వచ్చాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్స్ అకాడమీ మొదలగు ప్రసిద్ధ వైద్య సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించి పురస్కారములు యిచ్చాయి. 1990లో విజయశ్రీ అవార్డు, 1986 లో డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు అందుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. Indo American Cancer Institute & ... vs Sri Shankaraiah, S/O.Sarvaiah, ... on 18 January, 2013
  2. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్ విజయవాడ ed.). విజయవాడ: శ్రీవాసవ్య. 1 July 2011.
  3. The Essentials of Forensic Medicine and Toxicology by K. S. Narayan Reddy[permanent dead link]
  4. Synopsis Of Forensic Medicine & Toxicology

ఇతర లింకులు[మార్చు]