Jump to content

కుందేళ్ళలో వ్యాధులు

వికీపీడియా నుండి

కుందేళ్ళ పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోని యెడక చాలా రకాల వ్యాధులు ప్రబలి అవి మరణించే ప్రమాదం వుండి.[1]

పాస్ట్యురెల్లోసిస్

[మార్చు]

స్వచ్ఛమైన గాలిరాని, పరిశుభ్రతలేని పౌష్టికాహార లోపాలు ఈ రకమైన వ్యాధులు రావడానికి కారణం. ఈ వ్యాధి తల్లి కుందేలు నుంచి పిల్లలకు సోకుతాయి.

రోగలక్షణాలు
నిరంతరం తుమ్మడం, దగ్గుట వలన కుందేళ్ళు ముందు కాళ్ళతో ముక్కును రుద్దుకుంటాయి. శ్వాస తీసుకొన్నప్పుడు గలగలమని శబ్దం వస్తుంది. అదే కాకుండా జ్వరం, అతివిరేచనములు కూడా ఉంటాయి. ఈ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు శరీరంపై పొక్కులులాగ రావడానికి కారణమయి, మెడ వంకరపోవడం కూడా జరుగుతుంది.

చికిత్స
పాస్ట్యురెల్లోసిస్ వ్యాధి చికిత్స అంత ప్రభావితం చూపదు. చికిత్స ద్వారా ఈ వ్యాధి నుంచి కోలుకున్నా ఈ వ్యాధికి గరైన కుందేళ్ళద్వారా ఆరోగ్యవంతమైన కుందేళ్ళకు ఈ వ్యాధి సోకుతుంది. ఆందువల్ల ఈవ్యాధికి గురైన కుందేళ్ళను ఫారం నుండి బయటకు వేరుచేయడమొక్కటే మార్గము.

ప్రేగులకు సంబంధిత రోగం (ఎంటిరైటిస్)

[మార్చు]

వివిధ రకాలైన సూక్ష్మజీవుల ద్వారా కుందేళ్ళకు ప్రేగులకు సంబంధించిన వ్యాధులకు గురౌతాయి. మేతలో ఒకసారిగా మార్పు, మేతలో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు, క్షీణించిన రోగనిరోధక శక్తి, మేతలో, త్రాగునీటిలో పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలు, రోగకారక సూక్ష్మజీవులద్వారా ముందుగానే ఈవ్యాధికి కుందేళ్ళు గురౌతాయి. అతిసారము, ఉదరం వ్యాకోచించడం, బొచ్చు తగ్గిపోవడం, శరీరంలో నీరులేకపోవడం, ఈ వ్యాధి లక్షణాలు. శరీరంలో నీటిని, అతిసారము వల్ల కోల్పోవడం ద్వారా చురుకుదనం కోల్పోతాయి.

మెడ వాల్చు రోగము

[మార్చు]

పాస్ట్యురెల్లోసిస్ ప్రభావము వలన కుందేళ్ళు ఈ మెడ వాల్చు రోగమునకు గురౌతాయి. ఇది మధ్య చెవి, మెదడు మీద ప్రభావమును చూపుతుంది. ఈ వ్యాధి మధ్యచెవి పొరపై ప్రభావము చూపుటవలన కుందేలు చెవి నుండి చీము కారుతుంది. దీని వలన కుందేలు తలను ఒక వైపుకు వాల్చివేస్తుంది. తక్షణ పూర్తి పాస్ట్యురెల్లోసిస్ చికిత్స ద్వారా కుందేళ్ళలో మెడ వాల్చు రోగమును అదుపు చేయవచ్చు.

స్తనముల వాపు రోగము (మాన్ టైటిస్)

[మార్చు]

పాలిచ్చే తల్లి కుందేళ్ళు ఈ రోగమునకు గురౌతాయి. ఈ వ్యాధికి గురైన కుందేళ్ళ పొదుగు ఎర్రగా, స్పర్శకు నొప్పిగా ఉంటాయి. సరిపోయే వ్యాధినిరోధక మందులనివ్వడం ద్వారా కుందేళ్ళలో ఈ వ్యాధిని అదుపుచేయవచ్చు.

ఫంగస్ వలన అంటువ్యాధులు

[మార్చు]

డెర్మటోఫైసిస్ అనే ఫంగస్ ద్వారా కుందేళ్ళలో చర్మవ్యాధులు కలుగుతాయి. దీని వలన ముక్కు, చెవుల చుట్టూ ఉన్న వెండ్రుకలు ఊడిపోతాయి. దురద వలన కుందేళ్ళు వ్యాధి సోకిన ప్రాంతాలను బాగా రుద్దడం వలన ఆ ప్రాంతాలలో పుండ్లు పడతాయి. తర్వాత రెండవ దశ సూక్ష్మ క్రిముల వలన ఈ ప్రదేశాలలో చీము తయారౌతుంది.

చికిత్స
వ్యాధి సోకిన ప్రాంతాలలో గ్రిసోఫల్విన్ లేక బెన్జైల్ బెన్జోయేట్ మలామును పూయాలి. కిలో గ్రాము మేతలో 0.75 గ్రాముల గ్రిసోఫల్విన్ ను కలిపి రెండు వారాలకు వరకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని అదుపుచేయవచ్చు.

కుందేళ్ళు వ్యాధిగ్రస్తం కాకుండా పాటించవలసిన పరిశుభ్రతా ప్రమాణాలు

[మార్చు]
  • కుందేళ్ళ ఫారం మంచి గాలి, వెలుతురు ఉన్న ఎతైన ప్రదేశంలో ఉండాలి.
  • బోనులు చాలా శుభ్రంగా ఉంచాలి.
  • కుందేలు షెడ్ చుట్టూ చెట్లను పెంచాలి.
  • సంవత్సరానికి రెండు సార్లు సున్నం వేయాలి.
  • వారానికి రెండు సార్లు బోను అడుగున సున్నపు నీటిని చల్లాలి .
  • వేసవి కాలంలో వేడి గాల్పుల వలన కుందేళ్ళ మరణాలు అరికట్టడానికి నీటిని కుందేళ్ళపై చల్లుతూ ఉండాలి.
  • ప్రత్యేకంగా తల్లికుందేళ్ళకు, పిల్లకుందేళ్ళకు త్రాగడానికి నీటిని ఇచ్చేటప్పుడు నీటిని మరిగించి, చల్లార్చి ఇవ్వాలి.
  • వ్యాధికారకాలైన సూక్ష్మక్రిములను అరికట్టడానికి కుందేళ్ళకు లీటరు నీటిలో 0.5 గ్రాముల టెట్రాసైక్లిన్ ను కలిపి నెలకి మూడుసార్లు ఇవ్వాలి.

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]