కుందేళ్ళ మేత యాజమాన్య పద్ధతులు
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి, చిక్కుళ్ళు, పచ్చిరొట్ట రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి, వంటింటి వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు, ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి.[1]
కుందేళ్ళ మేతలో ఉండవలసిన పోషకాలు
పోషకాల వివరాలు | పెరుగుదల కొరకు | పోషణ కొరకు | గర్భాధారణ కొరకు | స్తన్యము కొరకు |
---|---|---|---|---|
జీర్ణమయ్యే శక్తి (కిలో కేలరీలు) | 2500 | 2300 | 2500 | 2500 |
మాంసకృత్తులు (%) | 18 | 16 | 17 | 19 |
పీచు పదార్థాలు (%) | 10-13 | 13-14 | 10-13 | 1013 |
కొవ్వు (%) | 2 | 2 | 2 | 2 |
కుందేళ్ళ మేతలో యాజమాన్యం గుర్తుంచుకోవలసిన విషయాలు
- కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం.
- కుందేళ్ళకు మేత కచ్చితంగా సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి.
- ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.
- పౌష్టికాహారాన్ని చిన్న గుళికల రూపంలో ఇవ్వాలి. ఇలా చిన్న గుళికల రూపంలో ఇవ్వడం వీలుకాక పోయినట్లయితే పౌష్టికాహారానికి నీటిని కలిపి చిన్న ఉండల రూపంలో కుందేళ్ళకు ఇవ్వాలి.
- ఒక కిలో బరువున్న కుందేలుకుః రోజుకు 40 గ్రాముల పౌష్టికాహారం, 40 గ్రాముల పచ్చిరొట్ట ఇవ్వాలి.
- కుందేళ్ళకు ఎల్లప్పుడూ తాజాగా ఉండే పచ్చిరొట్టను మేతగా ఇవ్వాలి. పచ్చిరొట్టను బోనులో నేల మీద వేయకూడదు కాని వాటిని బోనులో ప్రక్క భాగాలలోపలకు ఉంచవచ్చు.
- కుందేళ్ళకు రోజంతాపం శుభ్రమైన, నీటిని ఇవ్వాలి.
కుందేలు రకం | దాదాపు శరీరం బరువు | మేతపరిమాణం రోజుకి (గ్రాములలో) పౌష్టికాహారం మేత | మేతపరిమాణం రోజుకి (గ్రాములలో) పచ్చి రొట్ట |
---|---|---|---|
మగ కుందేలు | 4 - 5 కిలో గ్రాములు | 100 | 250 |
ఆడ కుందేలు | 4 - 5 కిలో గ్రాములు | 100 | 300 |
పాలిచ్చే, గర్భస్థ కుందేలు | 4- 5 కిలో గ్రాములు | 150 | 150 |
కుందేలు పిల్లలు | 0.6-0.7 కిలో గ్రాములు | 50-75 | 150 |
పౌష్టకాహారం మిశ్రమము యొక్క పాళ్ళు
చేర్చబడిన పదార్థములు | మొత్తం |
---|---|
మొక్కజొన్న రవ్వ (నూక) | 30 భాగాలు |
సజ్జల రవ్వ | 30 భాగాలు |
వేరుశనగ చెక్కపిండి | 13 భాగాలు |
గోధుమ పొట్టు | 25 భాగాలు |
ఖనిజ మిశ్రమం (లవణమిశ్రమం ) | 1.5 భాగాలు |
ఉప్పు | 0.5 భాగం |