కుక్కూ మోరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుక్కూ మోరే
సింగార్ (1949) చిత్రంలో కుక్కూ మోరే
జననం1928
మరణం30 సెప్టెంబరు 1981 (aged 52–53)
ఇతర పేర్లుకుక్కు
వృత్తినటి, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1946–1963

కుక్కూ మోరే (1928 - 1981 సెప్టెంబరు 30) ఆంగ్లో-ఇండియన్ నర్తకి, భారతీయ సినమాలలో నటి.[1] 1940, 1950లలో హిందీ చిత్రసీమలో క్యాబరే నృత్యకారిణిగా పేరుగాంచిన ఆమె రబ్బర్ గర్ల్ అని పిలువబడింది.[2]

కెరీర్[మార్చు]

కుక్కు 1946లో అరబ్ కా సితార చిత్రంలో తెరపైకి అడుగుపెట్టింది. స్టమ్ చండీలో ఆమె డ్యాన్స్ సామర్ధ్యాలతో అసంఖ్యాక అభిమానులను సంపాదించడంతో పాటు పలువురు సినిమా దర్శకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో అన్నీ మెహబూబ్ ఖాన్ సినిమాలే. అతని సినిమా అనోఖి అదా (1948)లో చేసిన క్యాబరే డ్యాన్స్ ఆమెను జీవితకాలం ప్రధాన నర్తకిగా నిలబెట్టింది. అందాజ్ (1949)లో నర్గీస్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ నటించిన రొమాంటిక్ డ్రామా, డ్యాన్స్ స్టార్‌కి తన నటనను ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది. ఆమె కెరీర్ లో ఆన్ (1952), మయూర్‌పంఖ్‌ (1954) చిత్రాలు మాత్రమే రంగు చిత్రాలు. ఇక ఆమె 1950లలో అధిక పారితోషికం తీసుకునే తారలలో ఒకరు.[3][4]

ఆమె చివరి చిత్రం 1963లో వచ్చిన ముజే జీనే దో.

మరణం[మార్చు]

కుక్కూ మోరే, 53 ఏళ్ల వయసులో 1981 సెప్టెంబరు 30న కాన్సర్ కారణంగా మరణించింది.[5]

మూలాలు[మార్చు]

  1. Rishi, Tilak (2012). Bless You Bollywood!: A tribute to Hindi Cinema on completing 100 years. Trafford Publishing. p. 240. ISBN 978-1-466-93962-2.
  2. "Cuckoo's cineplot profile". Archived from the original on 22 September 2012. Retrieved 14 August 2012.
  3. The Tragic ending of Cuckoo Moore – Helen remembers Cuckoo, CinePlot, archived from the original on 8 December 2015, retrieved 14 January 2016
  4. Sandip Pal (20 August 2015). "Forgotten gems of Bollywood - The Times of India". The Times of India. Retrieved 3 September 2016.
  5. The Tragic ending of Cuckoo Moore – Helen remembers Cuckoo, CinePlot, archived from the original on 8 December 2015, retrieved 14 January 2016