కుమారిముత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమారిముత్తు
జననం1940
మరణం29 ఫిబ్రవరి 2016 (వయస్సు 77)
చెన్నై , తమిళనాడు , భారతదేశం
వృత్తిసినిమా నటుడు

కుమారిముత్తు తమిళ సినిమా హాస్యనటుడు, డి.ఎం.కె పార్టీ నాయకుడు. [1][2] తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేక మేనరిజంతో, తనదైన నవ్వుతో పలు సినిమాల్లో హాస్యాన్ని పండించారు. 'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్' 'ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, 'మరుమగన్' సినిమాలు ఆయన కెరియర్లో ప్రధానమైనవిగా నిలిచాయి. మూడు దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలందించిన కుమారిముత్తు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ సభ్యుడిగా తమిళనాట రాజకీయాల్లోకి ప్రవేశించారు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన రంగస్థలం నుంచి సినిమా రంగానికి పరిచయం అయిన నటుడు. ఈయన సొంత ఊరు కన్యాకుమారి జిల్లా,కాట్టుప్పుదురై గ్రామం. ఆయన నటుడు నంబిరాజన్, దర్శకుడు కేఎం.బాలక్రిష్ణన్‌ల తమ్ముడు. 1964లో నగేశ్ నటించిన పోయ్‌సొల్లాదే చిత్రం ద్వారా చిత్ర రంగప్రవేశం చేసిన కుమరిముత్తు తమిళంతో పాటు తెలుగు, కన్నడం,మలయాళం భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. కలైమామణి అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నా కుమరిముత్తుకు తన నవ్వే ప్రత్యేకం.[4]

నటించిన కొన్ని సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర Notes
1981 నందు
1982 ముల్లిల్లత రోజా
1982 కోఝి కోవుతు
1984 మదురై సోరన్
1984 వెల్లాయ్ పూరా ఒండ్రు
1984 కై కొడుక్కం కాయ్
1986 ఓమాయ్ విజిగల్
1986 అరువదై నాల్ లోతా
1986 ఒరు ఇనియ ఉదయం
1986 డిసెంబర్ పూకల్
1987 ఆనంద్
1988 చిన్న పూవె మల్ల పేసు
1988 మనసుక్కుల్ మతప్పు
1988 ఇదు నమ ఆలు
1988 సహదేవన్ మహదేవన్
1989 పోగి వరుం కావేరీ
1990 పుదు వసంతం
1991 ఇరుంబు పోకల్
1991 చరణ్ పాండ్యన్
1991 నంబర్గల్
1992 నాన్‌గల్
1992 ఇందు
1992 ఎంగ వీటు వాలన్
1993 పెట్రెదుత పిల్లై
1994 సక్తివెల్
1995 చక్రవర్తి (1995 సినిమా)
1995 ఓరు ఓర్లా ఓరు రాజ్ కుమారి
1995 రాజీవిన్ పార్వైయిలె
1995 తోట్ట చినుగి
1995 ఆనజగన్
1995 తేడి వంద రాసా
1995 మరుమగన్ అరుముగం
2001 కన్నుక్కు కన్నగా పెరుమాల్
2002 అండిపట్టి అరసంపట్టి అరసంపట్టి తండ్రి
2004 జననం
2009 విల్లు

మరణం[మార్చు]

ఆయన ఫిబ్రవరి 29 2016 న తన 77వ యేట కన్నుమూసారు.[5][6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కుమరిముత్తుకు భార్య పుణ్యవతి, కొడుకు ఐసక్ మాదవరాజన్, కూతుళ్లు సెల్వపుష్ప, ఎలిజబెత్ మేరీ, కవిత ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. B. Kolappan (29 March 2011). "Quest for star power". The Hindu. Cite news requires |newspaper= (help)
  2. S.R. Ashok Kumar (6 May 2005). "Telefilm 'Engey Avan,' a laugh riot". The Hindu. Cite news requires |newspaper= (help)
  3. ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత PTI February 29, 201
  4. హాస్య నటుడు కుమరిముత్తు కన్నుమూత Sakshi | Updated: March 01, 2016
  5. http://www.newindianexpress.com/entertainment/tamil/Tamil-Comedian-Kumarimuthu-is-Dead/2016/02/29/article3302954.ece
  6. http://www.thehindu.com/entertainment/actor-kumarimuthu-dead/article8295354.ece