Jump to content

కుల్తార్ సింగ్ సంధ్వాన్

వికీపీడియా నుండి
కుల్తార్ సింగ్ సంధ్వాన్


శాసనసభ స్పీకర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
21 మార్చి 2022
ముందు రాణా కె. పి. సింగ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మార్చి 2017
నియోజకవర్గం కొట్కపుర

వ్యక్తిగత వివరాలు

జననం (1975-04-16) 1975 ఏప్రిల్ 16 (వయసు 49)
కొట్కపుర, పంజాబ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం కొట్కపుర
వృత్తి రాజకీయ నాయకుడు

కుల్తార్ సింగ్ సంధ్వాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] అతను కొట్కాపుర శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2022 మార్చి 21 నుండి పంజాబ్ శాసనసభ స్పీకర్‎గా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కుల్తార్ సింగ్ సంధ్వాన్ 1997లో కర్ణాటక నుంచి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం 2002లో క్రియాశీలక రాజకీయాల్లో వచ్చి 2003 నుంచి 2008 వరకు కాంగ్రెస్ మద్దతుతో సాంధ్వన్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయన 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు ఆప్‌లో చేరి ఆప్ కిసాన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.

కుల్తార్ సింగ్ సంధ్వాన్ 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొట్కాపురా శాసనసభ నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2022 మార్చ్ 21న శాసనసభ స్పీకర్‎గా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (20 March 2022). "Kultar Sandhwan: Of humble beginnings and strong political legacy" (in ఇంగ్లీష్). Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.
  2. The Economic Times (12 May 2022). "AAP MLA Kultar Sandhwan becomes Punjab Vidhan Sabha Speaker". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  3. The Hindu (21 March 2022). "AAP MLA Kultar Singh Sandhwan elected Punjab Assembly Speaker" (in Indian English). Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.