కూచివారి పల్లె
స్వరూపం
(కూచివారి పల్లి నుండి దారిమార్పు చెందింది)
కూచివారి పల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°11′01″N 79°08′49″E / 14.183503°N 79.146981°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | రాజంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516126 |
ఎస్.టి.డి కోడ్ |
కూచివారి పల్లె, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామవాసి గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే.