కూచివారి పల్లె
Jump to navigation
Jump to search
కూచివారి పల్లె, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 126., యస్.టీ.డీ.కోడ్ 08565.[1]
- ఈ గ్రామవాసి అయిన శ్రీ గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే. [1]
కూచివారి పల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | రాజంపేట |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516126 |
ఎస్.టి.డి కోడ్ |
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు కడప 27 జూలై 2013. 8వ పేజీ.