కృష్ణ బలిజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ కులాల జాబితా D గ్రూపు కులం.కృష్ణ బలిజ బలిజోళ్ళు అని కూడా పిలుస్తారు.

సామాజిక జీవితం, వృత్తి[మార్చు]

కుంకుమ, గంధాన్ని తయారు చేస్తారు.కుంకుమ తయారుచేయడానికి పడమటి కనుమలు, ఆరావళి పర్వతాలలో రాళ్లు సేకరించి పొడిచేసి వజ్రకాయం పట్టి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. వసంతోత్సావాలలో చల్లుకోవటానికి పచ్చ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి రంగులను కూడా వీరే తయారు చేస్తారు. వట్టివేళ్లు, ఉత్తరేణి వేళ్లు, గంధం పొడిలో కలిపి తయారు చేస్తారు.కుంకుమతోపాటు వసంతోత్సవాలలో వాడే బుక్కా నే కాదు, గులాబ్, పన్నీరు వంటి వాటిని కూడా తయారు చేస్తారు. కుంకుమ అమ్మే వారిని కుంకపోళ్లని, బుక్కా అమ్మేవారిని బాక్కా వారని పిలుస్తుండేవారు. స్త్రీలు ఉపయోగించే అలంకరణ సామ గ్రి కుంకుమ, కాటుక, గాజులు, పూసలు, పిన్నులు, సవరాలు ఇతర సౌందర్యసామగ్రి కూడా అమ్ముతారు. ఫ్యాన్సీ షాపులు వీరి వృత్తిని దెబ్బతీశాయి. వీరు గంపల్లో పెట్టుకుని అమ్మే సామాను ఫ్యాన్సీ షాపుల్లోని అద్దాల షో కేసుల్లో అందంగా, ఆకర్షణీయంగా కనిపించటంతో సామాన్య ప్రజలు అటువైపు మొగ్గు చూపారు. వీరు మారుమూల పల్లెలు, గ్రామాలు ఎంచుకున్నారు. ఫుట్‌ పాత్‌లపైనా, తోపుడు బండ్లమీద, సైకిళ్ల పైన ఊరూరా తిరిగి వ్యాపారం చేస్తుంటారు. పాత గుడ్డలు, అల్యూమినియం సామగ్రి, మహిళలకు కావాల్సిన వస్తువులు అమ్ముకుని జీవిస్తున్నారు. పూర్వం సంచారం చేస్తూ జీవనం సాగించిన వీరు స్వాతంత్య్రానంతరం స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయినా ఊరూరా తిరిగి సామగ్రిని అమ్ముకునే జీవన విధానానికి స్వస్తిపలకలేదు.

రుపాంతరం చెందుట[మార్చు]

అయితే దీనిలో కొన్ని తెగలు బట్టల వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. కృష్ణ బలిజ కులం వారు నేడు హైదరాబాదు, విజయవాడ , గుంటూరు , చీరాల, బాపట్ల, అనంతపురం, ఏలూరు, కొయ్యల గూడెం, రాజమహేంద్రవరం , విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, మొదలగు పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు

నివేదనలు[మార్చు]

బిసి-డి గ్రూపులో కృష్ణ బలిజ అని కులంగా ఉన్నారు. తమను గ్రూప్‌-డి నుంచి `ఎ'లోకి మార్చాలని కోరుతు న్నారు.

ఇవీ చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా