Jump to content

కెంటారో మియురా

వికీపీడియా నుండి
కెంటారో మియురా
రచయిత మాతృభాషలో అతని పేరు三浦 建太郎
పుట్టిన తేదీ, స్థలం(1966-07-11)1966 జూలై 11
చిబా , జపాన్
మరణం2021 మే 6(2021-05-06) (వయసు 54)
వృత్తిమాంగా ఆర్టిస్ట్
భాషజపనీస్
జాతీయతజపనీస్
రచనా రంగండార్క్ ఫాంటసీ
గుర్తింపునిచ్చిన రచనలుమాంగా బెర్సెర్క్‌
పురస్కారాలుతేజుకా ఒసాము సాంస్కృతిక బహుమతి (2002)
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు1976–2021

కెంటారో మియురా (1966 జూలై 11 - 2021 మే 6) జపనీస్ మాంగా ఆర్టిస్ట్. ఈయన 1989 లో జపాన్ విశ్వవిద్యాలయం ఆర్ట్ విభాగం నుండి పట్టభద్రుడయ్యాడు. డార్క్ ఫాంటసీ మాంగా బెర్సెర్క్‌ అనే ఫాంటసీ కళారూపానికి ప్రాచుర్యం పొందాడు, ఇది 1989 లో సీరియలైజేషన్ ప్రారంభమై 2021 వరకు కొనసాగింది.[1] 2021 నాటికి, బెర్సెర్క్ 50 మిలియన్లకు పైగా కాపీలు ప్రచురితమైంది, ఇది అత్యధికంగా అమ్ముడైన మాంగా సిరీస్‌లో ఒకటిగా నిలిచింది.2002 లో మియురాకు తేజుకా ఒసాము సాంస్కృతిక బహుమతి లభించింది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కెంటారో మియురా 1966 లో జపాన్‌లోని చిబా ప్రిఫెక్చర్‌లోని చిబా నగరంలో జన్మించాడు. 1976 లో మొట్టమొదటగా తన 10వ ఏట మిరాంజర్ పేరుతో ఒక మాంగాని తయారు చేశాడు, ఇది ఆటను చదువుతున్న పాఠశాలలో ప్రచురించబడింది. 1977 లో మీయురా తన రెండవ మాంగా కెన్ ఇ నో మిచిని రూపొందించాడు. దీనిలో మొదటిసారిగా ఆటను భారత సిరా (ఇండియా ఇంక్) ని ఉపయోగించాడు. అతను 1979 లో మధ్య పాఠశాలలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ డ్రాయింగ్ పద్ధతులు నేర్చుకున్నాడు, దీంతో అతని నైపుణ్యం మరింత మెరుగైంది.[2]

మీయురా 1982 ఉన్నత పాఠశాల్లో చదువుకునే రోజుల్లో ఆర్ట్ క్లాసుల్లో చేరాడు. 18 సంవత్సరాల వయసులో మీయురా జార్జ్ మోరికావాకు సహాయకుడిగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "వ్వాషింగ్టన్ పోస్టు". వాషింగ్టన్ పోస్ట్.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. iura, Kentarō (2019). Berserk. DeAngelis, Jason,, Johnson, Duane, 1976-, Nakrosis, Dan,, Studio Cutie (Deluxe edition. First ed.). 1976. ISBN 978-1-5067-1198-0.