Jump to content

కరణం లీలా వెంకట్ శ్రీనివాస్ శ్రీహరి నాగ వరప్రసాద్

వికీపీడియా నుండి
(కె.ఎల్.వి.ఎస్.ఎస్.ఎన్.వి. ప్రసాద్ బాబు నుండి దారిమార్పు చెందింది)
ప్రసాద్ బాబు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ బలగానికి చెందిన కెఎల్ వీఎస్ఎస్‌హెచ్ఎన్‌వీ ప్రసాద్ బాబుకు కేంద్ర ప్రభుత్వం 2013లో దేశంలోనే అత్యంత ఉత్తమమైన శౌర్య పతాకం అశోక చక్ర పురస్కారం మరణానంతరం కేటాయించింది. [1] ఆంధ్రప్రదేశ్ - చత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా గ్రేహౌండ్స్‌కు నాయకత్వం వహించిన ఎస్ఐ కె.ప్రసాద్ బాబు ఈ గౌరవం పొందాడు. "విధుల్లో నిబద్ధతను పాటిస్తూ మావోయిస్టులపై పోరాడడంలో అనిర్వచనీయమైన నాయకత్వంతో త్యాగనిరతిని చాటుకున్న శ్రీ ప్రసాద్ బాబు ప్రస్ఫుటమైన శౌర్యాన్ని ప్రదర్శించారు" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రసాద్ బాబు పూర్తి పేరు కరణం లీలా వెంకట్ శ్రీనివాస్ శ్రీహరి నాగ వరప్రసాద్ . ఇతను అనకాపల్లి మండలం మర్టూరుకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులలో మొదటిసారి అశోక చక్ర పురస్కారం అందుకున్న వ్యక్తి.తండ్రి పేరు కరణం వెంకట రమణ. తల్లి సత్యవతి.[3] రెండవ సంతానమైన వర ప్రసాద్‌కు ఇద్దరు సోదరులు. వరప్రసాద్ బావ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వర ప్రసాద్ తండ్రి రిటైర్డు ఏఎస్‌ఐ. వరప్రసాద్ పెదనాన్న కొడుకు డీఎస్పీగా పనిచేస్తున్నాడు. ఇలా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ‘కరణం’ కుటుంబం అంటే మార్టూరులో ఎంతో గౌరవం.

అశోకచక్ర అవార్డు ప్రదానం

[మార్చు]
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి తండ్రి కరణం వెంకట రమణ పురస్కారాన్ని అందుకుంటున్న చిత్రం

ఇతని సాహసానికి మెచ్చిన భారత ప్రభుత్వం, అత్యున్నత అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2014 జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా, డిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇతని తండ్రి కరణం వెంకట రమణకు ఈ పురస్కారాన్ని అందజేశారు.దివంగత ప్రసాద్‌కు ప్రఖ్యాత అశోకచక్ర అవార్డు ప్రదానంతో ఇప్పుడు దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అయ్యాడు. [4][5]

నక్సల్ పోరాటం, మరణం

[మార్చు]

తొమ్మిది మంది మావోయిస్టులను హతమార్చడంతో పాటుగా, ఇతరులను గాయపరచడంలో బాబు కీలకమైన పాత్ర పోషించాడు. 2013 సంవత్సరం ఏప్రిల్ 16న ఆంధ్రా - చత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో దాదాపు 70 మంది మావోయిస్టులు పేలుళ్ళు చేపట్టారు. అనంతరం బాబు నేతృత్వంలో గ్రేహౌండ్స్ బృందంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు బాబు, అతని బృందం మావోయిస్టులపై ఎదురు దాడికి దిగారు. వారిలో తొమ్మిది మందిని హతమార్చారు. మరుసటి రోజు కమాండోలను హెలికాప్టర్ల ద్వారా తరలించసాగారు. చివరి తరలింపులో భాగంగా 19 మంది కమాండోలు హెలికాప్టర్‌ను చేరుకోనున్న తరుణంలో దాదాపు 60 నుంచి 70 మంది మావోయిస్టులు హెలికాప్టర్‌పై దాడి చేశారు. ఆ క్రమంలో 14 మంది కమాండోలు హెలికాప్టర్ ఎక్కారు. బాబుతో పాటుగా నలుగురు కమాండోలు ఎదురు కాల్పులు ప్రారంభించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది.హెలికాప్టర్ వెళ్ళిపోగానే, మావోయిస్టులు కమాండోలను ముట్టడించారు. మిగిలిన నలుగురు కమాండోలను వెనక్కి తిరిగిపోవాల్సిందిగా బాబు విజ్ఞప్తి చేశాడు. ఆ నలుగురు సురక్షిత ప్రాంతానికి చేరుకునేంతవరకు ప్రసాద్ బాబు ఒంటి చేత్తో దాదాపు 200 మంది మావోయిస్టులను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో బాబు మరణించారని ప్రకటన తెలిపింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Jan 26, PTI / Updated:; 2014; Ist, 18:33. "Prasad Babu: Posthumous Ashok Chakra to Andhra's anti-Naxal unit cop | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Posthumous Ashok Chakra to Andhra Pradesh's anti-Naxal unit cop". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-01-26. Retrieved 2021-07-21.
  3. 2014 జనవరి 27 ఈనాడు పత్రిక
  4. http://www.sakshi.com/news/andhra-pradesh/prasad-asokacakra-award-100643
  5. 5.0 5.1 PTI. "Posthumous Ashok Chakra to Andhra's anti-Naxal unit cop". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.

వెలుపలి లంకెలు

[మార్చు]