కొండముది గోపాలరాయశర్మ
స్వరూపం
(కె.జి.శర్మ నుండి దారిమార్పు చెందింది)
కొండముది గోపాలరాయశర్మ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నాటక, సినీ రచయిత |
కొండముది గోపాలరాయశర్మ ప్రముఖ నాటక, సినీ రచయిత.[1] సామాజిక ఇతివృత్తంతో నాటకాలు రాసేవాడు.
నాటకరంగ ప్రస్థానం
[మార్చు]ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటకపోటీలు ప్రారంభమైన తొలిరోజుల్లో నాటక రచనలు చేశాడు. ఈయన తొలి నాటకమైన ఎదురీతను ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు ముద్రించారు. గోపాలరాయశర్మ రచనలు సామాజిక ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి.
రచించిన నాటకాలు
[మార్చు]- ఎదురీత (1945): కులాంతర వివాహం చేసుకోవాలనుకునేవాళ్లకి సమాజంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వుతాయో, వాటిని ఎదుర్కొని ఎలా విజయం సాధించారో ఈ నాటకంలో చూపించబడింది. దీనికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో ఉత్తమ రచన, ప్రదర్శనల విభాగంలో బహుమతులు లభించాయి.[2]
- ఇదీలోకం (1946): పెట్టబడిదారుల అరాచకాలు, పేదవారి ఆకలి చావుల గురించి ఈ నాటకంలో చెప్పబడింది.
- న్యాయం (1947): అగ్ర తరగతులవారిచే మధ్య తరగతివారికి కలిగిన అవమానాలను ఈ నాటకంలో చూపించబడింది.
- ఏకదేశం (1947): ఇది చారిత్రక నాటకం ఆంగ్లేయుల రాక నుండి స్వాతంత్ర్యం వచ్చినంతవరకు జరిగిన సంఘటనలను ఇందులో చూపబడింది.
- గౌతమబుద్ధ (1949)
మాలాలు
[మార్చు]- ↑ కొండముది గోపాలరాయశర్మ, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 424.
- ↑ సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14