Jump to content

కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం

వికీపీడియా నుండి

చరిత్ర

[మార్చు]

గ్రంథాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్ఞాన నిధి వంటిది. విజయవాడలో కల కాకరపర్తి భావనారాయణ కళాశాలలో u.g గ్రంథాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంథాలయం కాకరపర్తి భావనారాయణ కళాశాల కళాశాల గ్రంథాలయం.

శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం 1965 వ సంవత్సరములో స్థాపించబడింది.

పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూదనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంథాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంథాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.

గొప్ప ఉద్దేశము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంథాలయాన్ని స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంథాలయ ప్రథమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంథాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి. తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంథాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంథాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంథాలయంనకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.

గ్రంథాలయ ధ్యేయాలు

[మార్చు]
  • గ్రంథాలయ సహాయంతో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
  • గ్రంథాలయాన్ని ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ, నకళ్ళ ప్రతులను అందించుట.
  • సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
  • విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
  • విద్యార్థులకు, సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
  • అంతర్జాలము, డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.

డిజిటల్ గ్రంథాలయం

[మార్చు]
  • విద్యార్థులకు, సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.
  • ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విద్యార్థులకు తగిన సదుపాయం అందించుట.
  • INFLIBNET-N- యొక్క జాబిత..
  • ACM యొక్క డిజిటల్ గ్రంథాలయం అన్ని వేళలయందు అందించుట.
  • విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
  • సామాజిక భావం, సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..

గ్రంథాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు

[మార్చు]
  • డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902, పి.జీ లోని పుస్తకాలు 12,475. .
  • డిగ్రీ లోని మాసాంతపు పుస్తకాలు 39, పి.జీ లోని పుస్తకాలు 87..
  • జర్నల్స్ మొత్తం 39.
  • డిగ్రీ దినపత్రికలు మొత్తం 10, పి.జీ దినపత్రికలు 7.
  • గతానికి సంబంధించిన ప్రతులు మొత్తం 765, పి.జీ ప్రతులు 462.
  • డిగ్రీ లోని సి.డీ ల సంఖ్య 901, పి.జీ లోని సి.డీ ల సంఖ్య 284. .

సేవలు

[మార్చు]
  • అందరికీ అందుబాటులో వుండే విధానం.
  • అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంథాలయం.
  • పుస్తకాల చలామణీ సదుపాయం.
  • నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
  • వార్తాపత్రికల యొక్క క్లిప్పింగుల సదుపాయం.
  • నూతన విద్యార్థినీ, విద్యార్థులకు గ్రంథాలయ నేపథ్య సేవలు.
  • విద్యావిషయాలకు సంబంధించిన సి.డి.రొంల సౌలభ్యం.
  • సమాచారము, ప్రకటనల ప్రదర్శనా సౌలభ్యం.
  • కంప్యూటర్ అనుసంధానంగా నకళ్ళు అందించే సౌలభ్యం.
  • పత్రికా సమాచారానికి సంబంధించిన సేవలు.

లక్ష్యాలు

[మార్చు]
  • అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.
  • నాణ్యమైన విద్యను నిర్వహించే మూలకం చేయడానికి.
  • విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
  • జాతీయత, జాతీయసమైక్యతా, నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
  • సామాజిక భావం, సామాజిక బాధ్యతలను నేటి యువతరంలో పెంపొందించుట.

సదుపాయాలు

[మార్చు]
  • ఐ.సి.ఎస్.ఎస్.ఆర్, డి ఎస్ టి యొక్క పరిశోధనా ప్రతిపాదనలు.
  • ఐక్యరాజ్యసమితి ప్రపంచబ్యాంక్, డి ఎస్ టి, ఒ బి టి ల ఎలక్త్రానిక్ సమాచారం.
  • సామూహిక చర్చనీయాంశాలకు సంబంధించిన సమాచారం.
  • IELTS ఎలక్ట్రానిక్ సమాచారం.
  • విద్యావిషయాలు, సమాజానికి చేరువయ్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.
  • విపత్తు నిర్వాహణకు సంబంధించిన సమాచారం.

ముఖ్యాంశాలు

[మార్చు]
  • కొత్తగా వచ్చిన అంశాలపై ఫోల్డర్లు.
  • పుస్తక సమీక్షలకు సంబంధించిన ఫోల్డర్లు.
  • "మీ ఇంగ్లీషు గురించి తెలుసుకోండి" సంబంధించిన ఫోల్డర్లు.
  • అన్ని దినపత్రికలకు సంబంధించిన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పాత ప్రశ్నాపత్రాలు.
  • ది-హిందూ దినపత్రికలో ప్రచురితమైన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పుస్తక పఠనముందు పోటీలు నిర్వహించుట.
  • గ్రంథాలయ సేవలను ఉపయోగించుకునే దిశగా ఏర్పాటు చేయబడే కార్యక్రమాలు.

సాంకేతికపరమైన పనులు

[మార్చు]
  • గ్రంథాలయము లోని పుస్తకములన్నియు వర్గీకరించబడినవి..
  • ప్రారంభములో పుస్తకాల వర్గీకరణ కొరకు డిడిసి యొక్క 20 వ సంచిక ఉపయోగించబడింది..
  • ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ మినహా మిగిలిన పుస్తకాలన్ని డిడిసి యొక్క 18 వ సంచిక ప్రకారం వర్గీకరించబడుచున్నవి.
  • కంప్యూటర్ సైన్స్ పుస్తకాల వర్గికరణ డిడిసి యొక్క 20 వ సంచిక ప్రకారం జరుగుతుంది..
  • ఆరంభంలో పుస్తక ఫారంలో వున్న కేటలాగులను వినియోగించడమైనది.
  • ప్రస్తుతం కార్డు ఫారంలో ఉన్న కేటలాగులను వినియోగించుచున్నాము.
  • పుస్తకాలు ఇవ్వడానికి తిరిగి తీససుకొవడనికి మార్పు చేయబడిన నెట్వర్క్ పద్ధతిని అనుసరిస్తున్నాము. దీనికి ప్రత్యేక సిబ్బంది కలరు.
  • సిబ్బందికి విద్యార్థులకు అన్ని వేళల గ్రంథాలయ సేవలు .
  • గ్రంథాలయం లోని పుస్తకముల నిల్వ యొక్క కంప్యూటరీకరణ EZLIBRARY కి సంబంధించిన VOLK Software ద్వారా జరుగుతున్నది.