కె. విశాలిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.విశాలిని
జననం
తిరునెల్ల్వెలి, తమిళనాడు, భారతదేశం
పౌరసత్వంభారతీయులు
విద్యబి.టెక్
క్రియాశీల సంవత్సరాలు2003-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Highest Vertified IQ of 225
Youngest CCNA certificate holder
తల్లిదండ్రులుKalyana Kumarasamy (Father)
S. Sethu Ragamaliga (Mother)

ప్రపంచ రికార్డు 225 ఐక్యూ స్థాయితో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన 15 ఏళ్ల విద్యార్థిని విశాలిని. ఈమె తమిళనాడు తిరునెల్వేలిలో 23-05-2000 న జన్మించింది. ఈమె ప్రస్తుతం శ్రీవిల్లిపుత్తూరులోని కలశలింగం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతుంది. ఈమె తిరునెల్వేలిలోని శంకర్‌నగర్ ప్రాంతానికి చెందిన కల్యాణకుమారస్వామి, సేతురాగమాలిగల కుమార్తె. ఈమె 2015 లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో సంభాషించారు.

విద్య[మార్చు]

మూడో తరగతి చదువుతున్నప్పుడే ఈమె ప్రతిభను గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఈమెను మూడో తరగతి నుంచి ఐదో తరగతికి, ఆ తరువాత ఏకంగా ఎనిమిదో తరగతికి మార్చారు. ప్రస్తుతం పదో తరగతిలో ఉండాల్సిన ఈమె శ్రీవిల్లిపుత్తూరులోని కలశలింగం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతుంది.

రికార్డులు[మార్చు]

  • ప్రపంచ అత్యధిక ఐక్యూ (225)
  • ది యంగస్ట్ సిస్కో సర్టిఫైడ్ నెట్ వర్క్ అసోసియేషన్ వరల్డ్ రికార్డు హోల్డర్
  • ది యంగస్ట్ ఐఈఎల్‌టీఎస్ వరల్డ్ రికార్డు హోల్డర్
  • ది యంగస్ట్ ఎక్సిన్ క్లౌడ్ కంప్యూటింగ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్
  • ది యంగస్ట్ సీసీఎస్‌ఏ వరల్డ్ రికార్డు హోల్డర్

గుర్తింపులు[మార్చు]

ప్రపంచంలోనే "యంగెస్ట్ గూగుల్ స్పీకర్" గా, "టీఈడీఎస్ స్పీకర్" గా గుర్తింపు పొందింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు చెందిన సమస్యాత్మక కోర్సులను కూడా ఆమె త్వరితగతిన పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందింది.

మూలాలు[మార్చు]

  • 04-09-2015 ఈనాడు దినపత్రిక - విశ్వమేధావి విశాలిని (అత్యధిక ఐక్యూ ఆమె సొంతం)

బయటి లింకులు[మార్చు]