Jump to content

కేంద్రకామ్లాలు

వికీపీడియా నుండి
ఎడమవైపు ఆర్.ఎన్.ఎ. కుడివైపు డి.ఎన్.ఎ. ల నిర్మాణం.

కేంద్రకామ్లాలు జన్యు పదార్థాలుగా వ్యవహరించే జీవ రసాయనాలు. ఇవి న్యూక్లియోటైడ్‌లు అనే ప్రమాణాల పాలిమర్లు. న్యూక్లియోటైడ్‌ల మధ్య ఏర్పడే ప్రత్యేక పాస్ఫోడై ఎస్టర్ బంధాల ద్వారా కేంద్రకామ్లం ఏర్పడుతుంది. ఇది రెండు రకాలు - డీఎన్‌ఏ (డీ ఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్), ఆర్‌ఎన్‌ఏ (రైబోన్యూక్లిక్ యాసిడ్), డీఎన్‌ఏలో నాలుగు రకాల న్యూక్లియోటైడ్‌లు ఉంటాయి. అడినిన్, గ్వానిన్, సైటోసిస్, థైమిన్ అనే 4 రకాల న్యూక్లియోటైడ్‌ల పాలిమర్‌గా డీఎన్‌ఏ ఉంటుంది.

ఇది డబుల్ హెలిక్స్ నిర్మాణం. రెండు పాలీ న్యూక్లియోటైడ్ శృంఖలాలు సర్పిలాకారంలో మెలిక తిరిగి ఉంటాయి. డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల క్రమంలో జీవ లక్షణాలకు సమాచారం ఉంటుంది. ఒక జాతి డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల అమరిక మరో జాతి జీవుల డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల అమరికకు భిన్నంగా ఉంటుంది. మనిషిలో కొత్తతరం ఆవిర్భవానికి, తల్లి దండ్రుల అండం, శుక్ర కణాల రూపంలో సంయుక్త బీజకణానికి అందించే డీఎన్‌ఏ కారణమవుతుంది. డీఎన్‌ఏలోని వివిధ భాగాల్లో ప్రొటీన్లకు సమాచారం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌కు సమాచారం ఉన్న డీఎన్‌ఏ భాగాన్ని సాధారణంగా జన్యువు అంటారు. ఒక జన్యువులోని సమాచారం ఆధారంగా శరీర కణాల్లో రైబోజోములు ప్రొటీన్లను తయారు చేస్తాయి. ఇది రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో జన్యువులోని సమాచారం ఆధారంగా ఆర్‌ఎన్‌ఏ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను అనులేఖనం (Transcription) అంటారు.

ఆర్‌ఎన్‌ఏ ఏకశృంఖల కేంద్రకామ్లం. దీనిలో నాలుగు రకాల న్యూక్లియోటైడ్‌లు ఉంటాయి. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. ఇలా ఏర్పడిన ఆర్‌ఎన్‌ఏలోని సమాచారం ఆధారంగా అమైనో ఆమ్లాల మధ్య బంధాలను ఏర్పరచి రైబోజోములు ప్రొటీన్లను తయారు చేస్తాయి. ఇలా ఏర్పడిన ప్రొటీన్‌లు ముఖ్యంగా ఎంజైమ్‌గా లేదా హార్మోన్, ఇతర రకాలుగా వ్యవహరిస్తూ శరీరాన్ని నిర్మిస్తాయి.

రైబో కేంద్రక ఆమ్లం

[మార్చు]

డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం

[మార్చు]