రైబో కేంద్రక ఆమ్లం
Appearance
ఆర్.ఎన్.ఎ. అంటే రైబో కేంద్రక ఆమ్లం ప్రధానంగా రైబోసోమ్ లలో ఉంటుంది. ఇది కేంద్రకంలో ఉత్పత్తి చెంది, తరువాత కణద్రవంలోకి విడుదలవుతుంది. ఇవి ముఖ్యంగా మాంసకృత్తుల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇవి జన్యుపదార్ధంగా వ్యవహరించదు.
ఆర్.ఎన్.ఎ. నిర్మాణం
[మార్చు]ఆర్.ఎన్.ఎ. ఒకే పోచతో నిర్మితమై ఉంటుంది. కొన్ని వైరస్ లలో ద్వంద్వ పోగుల నిర్మాణం గల ఆర్.ఎన్.ఎ. కనిపిస్తుంది. ఆర్.ఎన్.ఎ. పోచ అనేక పాలీ న్యూక్లియోటైడ్ లతో ఏర్పడి ఉన్న పాలిమర్. ప్రతి న్యూక్లియోటైడ్ లో 3 భాగాలు ఉంటాయి. అవి 1. ఫాస్ఫేట్ సముదాయం, 2. రైబోస్ చక్కెర, 3. నత్రజని క్షారాలు. ఆర్.ఎన్.ఎ. లో నత్రజని క్షారాలు నాలుగు రకాలు. అవి అడినీన్, గ్వానీన్, సైటోసీన్, యురాసిల్. డి.ఎన్.ఎ.లో ఉన్న థైమీన్ కు బదులుగా యురాసిల్ అనే పిరిమిడిన్ ఉంటుంది. ఆర్.ఎన్.ఎ.లోని నత్రజని క్షారాల మధ్య సంపూరకత ఉండదు.
ఆర్.ఎన్.ఎ. రకాలు
[మార్చు]- ఆర్-ఆర్.ఎన్.ఎ. r-RNA
- టి-ఆర్.ఎన్.ఎ. t-RNA
- యం-ఆర్.ఎన్.ఎ. m-RNA