కేరళ సంగీత నాటక అకాడమీ
10°31′57.86″N 76°13′7.1″E / 10.5327389°N 76.218639°E
Kerala Sangeetha Nataka Academy | |
---|---|
Abbreviation | KSNA |
ఆవిర్భావం | 26 ఏప్రిల్ 1958 |
ప్రధానకార్యాలయాలు | Thrissur, Kerala, India |
ప్రాంతం | Kerala |
Chairperson | K. P. A. C. Lalitha (present) |
కేరళ సంగీత నాటక అకాడమీ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన త్రిసూర్ పట్టణంలో ఉంది.[1] ఇది 1958 ఏప్రిల్ 26న అప్పటి భారత ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ చే ప్రారంభించబడింది. ఇది కేరళ నృత్యం, నాటకం, సంగీతాన్ని పెంపొందించి అభివృద్ధి చేయడం కోసం ప్రారంభించబడింది. కేరళ సాంస్కృతిక ఐక్యతను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇది భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేయడం కోసం న్యూఢిల్లీ సంగీత నాటక అకాడమీతో సన్నిహిత సహకారంతో పనిచేస్తుంది. ప్రాంతీయ థియేటర్ అన్ని ఆధునిక సౌకర్యాలతో త్రిసూర్ పట్టణంలో ఉంది. 2010 అక్టోబరు 1 న బహ్రెయిన్ లోని బహ్రెయిన్ కేరళ సమాజంలో అకాడమీ ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభిస్తోంది.
ఈ బహ్రెయిన్ కేంద్రం అకాడమీ ప్రారంభించిన మొదటి సాంస్కృతిక విస్తరణ కేంద్రం. రియాద్, అబుదాబి, న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో కూడా అకాడమీ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.[2]
2017 ఏప్రిల్ 27న, అకాడమీ సంగీతం, నృత్యం, థియేటర్, సాంప్రదాయ కళారూపాలు వంటి వివిధ రంగాలకు 2016 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Literary and cultural societies". Government of Kerala. Archived from the original on 2012-02-18. Retrieved 2020-02-05.
- ↑ "Kerala Sangeeta Nataka Academy to start centre in Bahrain". CNN IBN. Archived from the original on 2012-10-13. Retrieved 2010-01-10.
- ↑ "Akademi awards announced". The Hindu. 28 April 2017. Retrieved 26 May 2018.