Jump to content

కే.ఆర్‌. నాగరాజు

వికీపీడియా నుండి
కే.ఆర్‌. నాగరాజు

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు ఆరూరి రమేష్
నియోజకవర్గం వర్ధన్నపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1963 మార్చి 4
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మునుస్వామి కర్పన్

కే.ఆర్‌. నాగరాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

వృత్తి జీవితం

[మార్చు]

కేఆర్ నాగరాజు 1989లో సబ్ ఇన్స్పెక్టర్‌గా పోలీస్ ఉద్యోగంలో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అత్యధికంగా మావోయిస్టు ప్రభావిత పరకాల, నెక్కొండ, మొగుళ్లపల్లి,  పూర్వపు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట వంటి ప్రాంతాలలో వివిధ హోదాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగి ఐపీఎస్ గా పదోన్నతి పొందిన తర్వాత నిజామాబాద్ సిటీ పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి 2023 మార్చి నెలలో పదవీ విరమణ చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కేఆర్ నాగరాజు నిజామాబాద్ సిటీ పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి 2023 మార్చి నెలలో పదవీ విరమణ చేరిన అనంతరం రాజకీయాల పట్ల ఆసక్తితో ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[3] 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వర్దన్నపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 19,458 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 December 2023). "పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. News18 తెలుగు (25 December 2021). "ఎస్ఐ​ నుంచి కమిషనర్​.. అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు నిజామాబాద్​లో పోస్టింగ్​." Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024. {{cite news}}: zero width space character in |title= at position 5 (help)CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (22 July 2023). "కాంగ్రెస్‌లోకి విశ్రాంత పోలీసు అధికారి నాగరాజు". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  4. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  6. Eenadu (5 October 2024). "నాటి సీపీ.. నేటి ఎమ్మెల్యే." Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.