కే బ్యారీ షార్ప్‌లెస్
బ్యారీ షార్ప్‌లెస్ | |
---|---|
జననం | కార్ల్ బ్యారీ షార్ప్‌లెస్ 1941 ఏప్రిల్ 28 ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, యు.ఎస్. |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ది స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్యుషు యూనివర్సిటీ |
పరిశోధనా సలహాదారుడు(లు) | యూజీన్ వాన్ టామెలెన్ |
డాక్టొరల్ విద్యార్థులు | ఎం.జి. ఫిన్ |
ఇతర ప్రసిద్ధ విద్యార్థులు | హార్ట్ముత్ కోల్బ్ |
ప్రసిద్ధి | ఎనాంటియోసెలెక్టివ్ సింథసిస్ క్లిక్ కెమిస్ట్రీ |
ముఖ్యమైన పురస్కారాలు |
|
కే బ్యారీ షార్ప్‌లెస్ (ఆంగ్లం: Karl Barry Sharpless; జననం 1941 ఏప్రిల్ 28) ఒక అమెరికన్ రసాయన శాస్త్రవేత్త. కెమిస్ట్రీలో రెండుసార్లు నోబెల్ గ్రహీత, స్టీరియోసెలెక్టివ్ రియాక్షన్స్, క్లిక్ కెమిస్ట్రీపై చేసిన కృషికి పేరుగాంచాడు.
విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతులు 2022లో కెమిస్ట్రీకి సంబంధించిన అవార్డ్‌ను కే బ్యార్రీ షార్ప్‌లెస్‌తో పాటు కరోలిన్ ఆర్ బెర్టోజ్జి, మోర్టెన్ పి మెల్డల్ లకు సంయుక్తంగా ప్రకటించారు.[1] ఔషధాలను డిజైన్ చేసేందుకు వీలుగా క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురష్కారం వరించింది.
దీంతో వైద్యపరిశోధనలు చేసే స్క్రిప్స్ రీసెర్చ్‌లో పనిచేస్తున్న కెే బ్యారీ షార్ప్‌లెస్ రెండోసారి నోబెల్ పురష్కారం అందుకోనున్న ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఆయనకు 2001లోనూ నోబెల్ అవార్డ్ వరించింది. ఇప్పటివరకు నోబెల్ బహుమతులను జాన్ బర్డీన్, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్ పాలింగ్, ఫ్రెడెరిక్ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించినవారిలో ఉన్నారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కార్ల్ బ్యారీ షార్ప్‌లెస్ 1965లో జాన్ డ్యూసర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.[2] 1970లో ఎంఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన కొద్దిరోజుల్లోనే ల్యాబ్ లో ఎన్.ఎమ్.ఆర్ ట్యూబ్ పేలిన ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్నడు. ఈ ప్రమాదం తర్వాత ఆయన "ప్రయోగశాలలో అన్ని వేళల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడానికి తగిన సాకు ఉండదు" అని నొక్కి చెప్పాడు.[3]
గుర్తింపు
[మార్చు]- ఆయన రెండుసార్లు నోబెల్ గ్రహీత. కే బ్యారీ షార్ప్‌లెస్ "చిరల్లీ ఉత్ప్రేరక ఆక్సీకరణ ప్రతిచర్యలు", "క్లిక్ కెమిస్ట్రీ"పై చేసిన కృషికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని 2001, 2022లలో అందుకున్నాడు.[4][5]
- 2019లో ఆయనకు "ఉత్ప్రేరక, అసమాన ఆక్సీకరణ పద్ధతుల ఆవిష్కరణ, క్లిక్ కెమిస్ట్రీ భావన , అజైడ్-ఎసిటిలీన్ సైక్లోడిషన్ రియాక్షన్ రాగి-ఉత్ప్రేరక సంస్కరణను అభివృద్ధి చేసినందుకు" అమెరికన్ కెమికల్ సొసైటీ అత్యున్నత గౌరవమైన ప్రీస్ట్లీ పతకం లభించింది.[6][7]
- ఆయన క్యుషు విశ్వవిద్యాలయంలో విశిష్ట విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఆయన కెటిహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1995), టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్ (1995), కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లౌవైన్ (1996), వెస్లియన్ యూనివర్శిటీ (1999) నుండి గౌరవ పట్టాలను పొందాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి". web.archive.org. 2022-10-06. Archived from the original on 2022-10-06. Retrieved 2022-10-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "K. Barry Sharpless". Notable Names Database. Soylent Communications. 2014. Retrieved July 12, 2014.
- ↑ "A cautionary tale from the past". MIT News | Massachusetts Institute of Technology (in ఇంగ్లీష్). Retrieved 2022-10-05.
- ↑ "The Nobel Prize in Chemistry 2022". Nobel Foundation. Retrieved 5 October 2022.
- ↑ "The Nobel Prize in Chemistry 2001". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved April 5, 2019.
- ↑ "2019 Priestley Medalist K. Barry Sharpless works magic in the world of molecules". Chemical & Engineering News (in ఇంగ్లీష్). Retrieved April 8, 2019.
- ↑ "K. Barry Sharpless named 2019 Priestley Medalist". Chemical & Engineering News (in ఇంగ్లీష్). Retrieved April 8, 2019.
- ↑ Henderson, Andrea Kovacs (2009). American Men & Women of Science. Farmington Hills, MI: Gale. Cengage Learning. pp. 764. ISBN 9781414433066.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- 1941 జననాలు
- యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యులు
- చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క విదేశీ సభ్యులు
- 21వ శతాబ్దపు అమెరికన్ రసాయన శాస్త్రవేత్తలు
- అమెరికన్ నోబెల్ గ్రహీతలు
- డార్ట్మౌత్ కళాశాల పూర్వ విద్యార్థులు
- హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు
- రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతలు
- నోబెల్ గ్రహీతలు
- సేంద్రీయ రసాయన శాస్త్రవేత్తలు
- స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు
- రసాయన శాస్త్రంలో వోల్ఫ్ ప్రైజ్ గ్రహీతలు
- స్టీరియోకెమిస్ట్స్