Jump to content

కైమోగ్రాఫ్

వికీపీడియా నుండి
లుడ్వింగ్ క్రైమోగ్రాఫ్

కైమోగ్రాఫ్ (Kymograph) (which means 'wave writer') ఒక వైద్య పరికరము. ఇందులో కాలానుగుణమైన మార్పుల్ని గ్రాఫికల్ గా రికార్డు చేస్తారు. ఈ పరికరంలో తిరుగుతున్న డ్రమ్ము చుట్టూ కాగితం చుట్టి ఉంటుంది. దాని మీద కదులుతున్న కలం వంటి స్టైలస్ ఒత్తిడి లేదా కదలికల్ని గుర్తించి పైకి, క్రిందకి కదిలి గీతలు గీస్తుంది.[1]

కైమోగ్రాఫ్ ను జర్మనీ శరీరధర్మ శాస్త్రవేత్త (physiologist) కార్ల్ లుడ్విగ్ 1840 శతాబ్దంలో కనిపెట్టాడు. మొదటిసారిగా దీనిని రక్త పీడన మాపకం (blood pressure monitor) గా ఉపయోగించారు. తరువాతి కాలంలో దీనితో అనేక వైద్యసంబంధ ప్రయోజనాల్ని కనుగొన్నారు.[2] ఇది ప్రాథమికంగా కండరాల సంకోచాల్ని, స్వరంలోని శబ్దాన్ని మార్పుల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. వీటిని వాతావరణ పీడనంలోని మార్పులు, లోహాల ప్రకంపనాల్ని, ఆవిరి యంత్రం పనితనాన్ని రికార్డ్ చేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Photo and Description of a 1903 kymograph". Archived from the original on 2007-06-05. Retrieved 2009-04-02.
  2. "Primary source texts and quotes on kymographs". Archived from the original on 2008-12-11. Retrieved 2009-04-02.