Jump to content

కైలాసం రాఘవేంద్రరావు

వికీపీడియా నుండి
కైలాసం రాఘవేంద్రరావు
జననం1958
చెన్నై, తమిళనాడు
వృత్తిపారిశ్రామికవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

కైలాసం రాఘవేంద్రరావు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త, ఆర్కిడ్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ స్థాపకుడు. ఒక సమయంలో ఆ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డి అండ్ బి లిస్టింగ్‌లో అగ్రశ్రేణి 500 భారతీయ కంపెనీలలో ఒకటిగా ఉండేది.[1] 2011 లో భారత ప్రభుత్వం, నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో రావును సత్కరించింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

రాఘవేంద్రరావు 1958 లో తమిళనాడు లోని చెన్నైలో జన్మించాడు.[3] అతను 1977 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ చేసాడు. 1979 లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.[3][4][5]

రావు 1979 లో, ప్యూర్ ఐస్ క్రీమ్స్[4][5] లో ఫైనాన్షియల్ కంట్రోలరుగా తన వృత్తిని ప్రారంభించాడు. 1981 లో అశోక్ లేలాండ్‌కు మారాడు.[4][5] హైదరాబాదు లోని స్టాండర్డ్ మెడికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కి[4][5] వెళ్లడం అతన్ని ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు పరిచయం చేసింది. ఈ సంవత్సరాల్లో, రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అసోసియేట్‌షిప్ కంపెనీ సెక్రటరీ (ACS) లకు చెందిన ICWAI కాస్ట్ అకౌంటింగ్ అర్హత సాధించాడు.[3] తదుపరి, 1982 లో ఒమన్‌ దేశం, మస్కట్ వెళ్ళి అక్కడ అల్ బురైమ్ గ్రూప్[4][5] లో పనిచేశాడు. 1992 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను స్వంతంగా ఆర్చిడ్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించాడు. కొద్ది సంవత్సరాలలో అది, భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది.[4][5]

రాఘవేంద్రరావు 1997లో ఇండియా యంగ్ బిజినెస్ అచీవర్ అవార్డు, 1999లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు.[3][5] 2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.[2] అతను ఆర్కిడ్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఆర్కిడ్ న్యూట్రికేర్ లిమిటెడ్, UK, BEXEL ఫార్మాస్యూటికల్స్, అల్ బురైమి గ్రూప్‌లలో డైరెక్టరుగా ఉన్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "DNB Listing". DNB. 2007. the original నుండి 22 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014.
  2. 1 2 "Padma Shri" (PDF). Padma Shri. 2014. the original (PDF) నుండి 15 October 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2014.
  3. 1 2 3 4 "Bio" (PDF). Orchid. 2014. the original (PDF) నుండి 24 సెప్టెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014."Bio" Archived 2024-09-11 at the Wayback Machine (PDF). Orchid. 2014. Retrieved 23 November 2014.
  4. 1 2 3 4 5 6 "India Info Online". India Info Online. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014."India Info Online". India Info Online. 2014. Retrieved 23 November 2014.
  5. 1 2 3 4 5 6 7 8 "Business Week". Business Week. 21 November 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014.{{cite web}}: CS1 maint: deprecated archival service (link). Business Week. 21 November 2014. Archived from the original on 23 November 2014. Retrieved 23 November 2014.