అక్షాంశ రేఖాంశాలు: 16°06′55″N 80°27′03″E / 16.115415°N 80.450760°E / 16.115415; 80.450760

కొండబాలవారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండబాలవారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొండబాలవారి పాలెం is located in Andhra Pradesh
కొండబాలవారి పాలెం
కొండబాలవారి పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°06′55″N 80°27′03″E / 16.115415°N 80.450760°E / 16.115415; 80.450760
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి పెద్ది లక్ష్మి
పిన్ కోడ్ 522 124
ఎస్.టి.డి కోడ్ 08645

కొండబాలవారిపాలెం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు, గత 20 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం రజక సంఘం పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువును, సర్పంచి శ్రీమతి పెద్ది లక్ష్మి, త్రవ్వించి, కట్టవేసి, ఒక రూపానికి తెచ్చారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పెద్ది లక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఆలయంలో 2014, మే-27 మంగళవారం నాడు అమ్మవారి తిరునాళ్ళు అత్యంతవైభవంగా నిర్వహించారు. అమ్మవారిని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పొంగళ్ళు పెట్టి నైవేద్యాలు చెల్లించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శిడిమానుకు బొట్లు పెట్టి పూజలు చేసారు. గ్రామవీధులలో డప్పు వాద్యాలతో శిడిమానును ఊరేగింపు చేసారు. బొడ్డురాయికి గూడా పూజలు చేసారు. పరిసరగ్రామాల ప్రజలు గూడా ఉత్సవాలలో పాల్గొని పూజలుచేసి తమ భక్తిప్రవుత్తులు చాటుకున్నారు.

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం

[మార్చు]

ఈ మందిర నవమ వార్షికోత్సవం సందర్భంగా, 2016, ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, బిల్వార్చన, సామూహిక కుంకుమార్చన, అన్నదానం, రాత్రికి భజన, వీధులలో పల్లకీ ఊరేగింపు నిర్వహించారు.

గ్రామంలో ప్రధానమైన పంటలు

[మార్చు]

వ్యవసాయం, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు