Jump to content

కొట్టుక్కాలి తమళ సినిమా

వికీపీడియా నుండి

కొట్టుక్కాలి తమళ సినిమా Kottukkali (The Adamant Girl)2024 – Tamil Movie ‘కొట్టుక్కాలి’ ఒక మొండిఘటం. సన్నివేశ శబ్దాలు తప్ప ఏవీ వినబడని మొండిఘటం. సన్నివేశం రక్తి కట్టడానికి సంగీతం తప్పకుండా ఉండాలనే మన అభిప్రాయాలని బద్దలు చేసిన మొండిఘటం. సినిమాని అందులో సీన్ ని పండించడానికి తీస్తున్న ప్రాంతం(ఏమ్బిఎన్స్), నటులు(జంతువులుకూడా) - వారి హావభావాలు వందకి వంద శాతం అమరితే అప్పుడు ఏ యితర హంగులు, పాటలు, ఫైట్లు అవసరం లేదని నిరూపించిన సినిమా ‘కొట్టుక్కాలి’. మధురై ప్రాంతం తమిళ మాండలికంలో ‘కొట్టుక్కాలి’ అంటే మొండి అమ్మాయి. ఈ సినిమాలో ‘మీనా మొండిపిల్ల. సినిమా అంతట్లో ఒకే ఒక్క డైలాగ్ మీనా పాత్రకి. తక్కువ కులం వాణ్ని ప్రేమించినందుకు ఆమెని కుటుంబం పెట్టే హింస ఈ సినిమా అంశం. కానీ ఆ హింస ఎక్కడా భయానకంగా, భౌతికంగా ఉండదు. ఆమెని పెళ్లిచేసుకోవాలనుకున్న మేనమామ, తల్లితండ్రి, పిన్ని, చుట్టాలు కలిసి తన మనసు మారడానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న కులదైవం మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళడం మాత్రమే సినిమా కథ. తిరుగుదారిలో మంత్రగాడి దగ్గర తనలో చెడు(గర్భం?) పోవడానికి చేసే తతంగం కూడా తన కుటుంబం ప్లాన్ చేస్తుంది. కానీ తమ ముందే వేరొక అమ్మాయికి ఇదే తతంగం చేయడం చూసిన పాండి(మేనమామ) చివరకు ఏం చేసాడనేదే ముగింపు. ఆ సన్నివేశం దగ్గర పాండి ఆలోచిస్తూ దూరం పోయి వుండడం చూపించి ప్రేక్షకుల ఊహకే ముగింపు వదలడం దర్శకుని సృజనాత్మకతకు, కళాత్మకతకు నిదర్శనం. బొంగురు గొంతు 'పాండీ'గా సూరి, 'మీనా'గా అన్నా బెన్ మిగిలిన నటులు, చాలా బాగా నటించారు.

ఈ ప్రయాణానికి ముందు మీనా తల్లి ఆమెకి తలకు నూనె రాసి శుభ్రంగా జడ వేస్తుంది. తిరుగు ప్రయాణంలో మీనా ఒక సందర్భంలో స్వేచ్ఛగా జుత్తు విరబోసుకుని తిరగాలి అనుకునే పగటి కల గా చూపే షాట్ మీనా మనస్థితికి మంచి ప్రతీక‌। మీనా స్థితికి ప్రతీకలుగా కోడిపుంజు, ఎద్దు వంటి సన్నివేశాలు చూసే వారికి అన్యాపదేశంగా యేవో ప్రతీకలు వుంటాయి. మొత్తం ప్రయాణం, కులదైవం ఉండే చిట్టడవి చేరువలో చిన్న మట్టిదారి, ప్రయాణానికి బయలుదేరిన ఆటో, ఒక బైక్, ఒక మోపెడ్ అన్నిటినీ పాత్రలు చేసి దర్శకుడు ఇది సినిమా కాదు, నీ చుట్టూనే జరుగుతోంది చూడు అని అన్నట్టు వుంటుంది. “నేను పాత్రల్ని మలచను వాటిని వాటి ఆరాల్లో వాటి సందర్భాల్లో అలానే ఉంచుతాను” అనే దర్శకుడు ‘పి.ఎస్.వినోద్ రాజ్’ రెండో సినిమా ఇది. మొదటి సినిమా అంతర్జాతీయంగా పదికి పైన అవార్డులు తెచ్చుకున్న 'కూళంగళ్'(pebbels). నాలుగో ఏటే తండ్రి చనిపోతే రకరకాల దినసరి కూలిపనులు చేసి తర్వాత ఒక డీవీడీ షాప్ లో పనిచేస్తూ ప్రపంచ సినిమాలు చూసి, అసిస్టెంట్ డైరెక్టర్ చేసికూడా సినిమా మేకింగ్ లో పోస్ట్ మోడర్నిస్టిక్ థియేటర్ ట్రూప్ లో చేరి తర్వాత షార్ట్ ఫిలిం, తర్వాత ‘పెబెల్స్’ తీసాడు "వినోద్ రాజ్. పెబెల్స్ ఆస్కార్ బరిలో నిలిచిన దేశీయ సినిమా. కొట్టుక్కాల్ నిర్మాత తమిళ హీరో శివకార్తికేయన్. మూలాలు: K Ramachandra Reddy ఫేస్ బుక్ లో వ్యాసం ఆధారంగా. వారికి కృతగ్జతలతో. .