కొడియార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడియార్ పదం మాతృక మరాఠి. కొడియార్ అంటే అపరకాళిక అని అర్థం. కొడియార్ అంటే తెల్ల కలువ అనే మరో అర్థం కూడా ఉంది. కొడియార్ ఇంటి పేరుగా మహారాష్ట్రలో వాడుకలో ఉంది. మరాఠాలో దేశాయ్, దేశ్ ముఖ్ లలో కొడియార్ ఇంటి పేరు కనిపిస్తుంది. దేశాయ్ లు, దేశ్ ముఖ్ లు మరాఠాలోని ఓ క్షత్రియ వర్గానికి చెందినవారు. నిజాం ఏలుబడిలో జమీందార్లుగా ఉన్న ఈ వర్గం ప్రజలు తెలంగాణా ప్రాంతంలో కూడా స్థిరపడ్డారు. వరంగల్ జిల్లాలో దేశాయిపేట, తెలంగాణాలో కొంతమంది పెద్దల పేర్ల వెనుక వచ్చే దేశ్ ముఖ్ ఇందుకు ఉదాహరణ.

"https://te.wikipedia.org/w/index.php?title=కొడియార్&oldid=2950664" నుండి వెలికితీశారు