కొప్పర్తి క్యాంపు
కొప్పర్తి క్యాంపు, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, బోధన్ మండలానికి చెందిన గ్రామం.
ఇది బోధన్ మండలంలో రెవెన్యూ హోదా లేని గ్రామం. గ్రామ పంచాయితీ హోదా కలిగిన గ్రామం
గ్రామ చరిత్ర
[మార్చు]గ్రామస్థుల పోరాటంతో 1994 లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పుడు ప్రథమ సర్పంచిగా వెనిగళ్ళ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు.ఇతని కుమారుడు సాంబశివరావు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డాడు.ఇతను తన స్వగ్రామాన్ని మరచిపోకుండా గ్రామాభివృద్ధిని కాక్షించి, తన తల్లిదండ్రులు సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లుల జ్ఞాపకార్ధం కొప్పర్తి క్యాంపు గ్రామంలో, రు. 45 లక్షలతో "శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణమండపం" ను నిర్మించాడు. దీనికి 2013, నవంబరు 14 న శంకుస్థాపన చేసి,నిర్మాణం పూర్తి అయిన తర్వాత 2014, ఫిబ్రవరి 12, గురువారం నాడు ప్రారంభించబడింది.[1&2]
ఈ గ్రామములోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి నాడు, అమ్మవారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహిస్తారు. చుట్టుప్రక్కల గ్రామాలయిన కుమ్మనపల్లి, సాలూరాక్యాంపు, నాగనపల్లి, సాలంపాడు, పెంటాఖుర్దు తదితర గ్రామాలనుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి పూజలు జరపుతారు. అనంతరం భక్తులకు అన్నదానం, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు నిజామాబాదు; 2014, ఫిబ్రవరి-13; 6వ పేజీ. [2] ఈనాడు నిజామాబాదు; 2014, ఫిబ్రవరి-15; 4వ పేజీ.