కొరమీను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరమీను
Korameenu.jpg
దర్శకత్వంశ్రీపతి కర్రి
రచనఆనంద్ రవి
నిర్మాతపెళ్లకూరు సమన్య రెడ్డి
నటవర్గంఆనంద్ రవి
హరీష్ ఉత్తమన్
శత్రు
కిశోరీ ధాత్రక్
రాజా రవీంద్ర
ఛాయాగ్రహణంకార్తీక్ కొప్పెర
సంగీతంఅనంత నారాయణన్ ఏజీ
సిద్ధార్థ్ సదాశివుని
నిర్మాణ
సంస్థ
ఫుల్ బాటిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీలు
31 డిసెంబర్ 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

కొరమీను 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఫుల్ బాటిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహించాడు. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలైంది.[1]

క‌థ‌[మార్చు]

విజ‌య‌వాడ‌లో డీజీపీ మీసాల రాజు (శ‌త్రు) అంటే రౌడీలకు హ‌డ‌ల్‌. అలాంటి వ్య‌క్తి వైజాగ్ సిటీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. సిటీలోకి వచ్చిన రోజునే జాలరిపేట బ్రిడ్జ్ దగ్గర ఎవరో అతడి మీసాలు తీసేస్తారు. మీసాల రాజు (శ‌త్రు), మీసాలు తీసింది ఎవరో అని ఆలోచించడం మొదలు పెట్టగా జాల‌రిపేట డాన్ వీర‌భ‌ద్రం కొడుకు క‌రుణ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) గురించి తెలుస్తుంది. మీనాక్షి (కిశోరీ ధాత్రక్) విషయంలో తన డ్రైవర్ కోటి (ఆనంద్ రవి)తో కరుణ గొడవ పడతాడు. జాల‌రిపేట‌లో జ‌రిగే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించిన గొడ‌వ‌లు ఇలా అన్ని విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఆ విష‌యాలు ఏంటి? జాల‌రి పేట‌లోని కోటి, మీనాక్షితో క‌రుణ‌కు ఉన్న గొడ‌వేంటి? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

 • ఆనంద్ రవి
 • హరీష్ ఉత్తమన్
 • శత్రు
 • కిశోరీ ధాత్రక్
 • రాజా రవీంద్ర
 • గిరిధర్
 • 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్
 • ఇందు కుసుమ
 • ప్రసన్న కుమార్

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఫుల్ బాటిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: పెళ్లకూరు సమన్య రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే: ఆనంద్ రవి[2]
 • దర్శకత్వం: శ్రీపతి కర్రి
 • సంగీతం: అనంత నారాయణన్ ఏజీ
  సిద్ధార్థ్ సదాశివుని
 • సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర
 • పాటలు: పూర్ణాచారి, లక్ష్మీ ప్రియాంక

మూలాలు[మార్చు]

 1. Eenadu (26 December 2022). "ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
 2. Andhra Jyothy (4 January 2023). "ఆ ఒక్క మాట.. వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=కొరమీను&oldid=3793264" నుండి వెలికితీశారు