కొరముట్ల శ్రీనివాసులు
కొరముట్ల శ్రీనివాసులు | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2024 | |||
ముందు | గుంటి వెంకటేశ్వర ప్రసాద్ | ||
---|---|---|---|
తరువాత | అరవ శ్రీధర్ | ||
నియోజకవర్గం | కోడూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 06 జులై 1971 రెడ్డివారిపల్లె కోడూరు మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | గంగయ్య, తులశమ్మ | ||
జీవిత భాగస్వామి | స్వర్ణ కుమారి | ||
సంతానం | పునీత్‌రాయ్, రాజశేఖర్ |
కొరముట్ల శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కొరముట్ల శ్రీనివాసులు 06 జూలై 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, కోడూరు మండలం, రెడ్డివారిపల్లెలో గంగయ్య, తులశమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన In 2000లో లా పూర్తి చేసి, 2002లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎంఎల్ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కొరముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అజయ్ బాబు నందవరంపై 12388 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కొరముట్ల శ్రీనివాసులు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 34879 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్‌గా నియమితుడయ్యాడు.[4] 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్‌పై 11,101 ఓట్ల తేడాతో ఓడిపోయారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ "Arava Sreedhar, JSP Candidate from Kodur Assembly Election 2024 Seat: Electoral History & Political Journey, Winning or Losing - News18 Assembly Election 2024 Result News". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-22.