కొల్లాయిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలు కొలాయిడ్ ద్రావణం

కొల్లాయిడ్స్ ను తెలుగులో కాంజికాభము అంటారు. పదార్దాలను వాటి వ్యాపన ధర్మాలు ఆధారంగా రెండు విధాలుగా వర్గీకరించారు. అవి క్రిష్తలాయిడ్స్ అనగా స్పటికాలను పొలినవి, కొల్లాయిడ్స్ అనగా గంజిని పొలినవి. నిజ ద్రావణం లోని ద్రావితం యొక్క కణ పరిమాణం పెరిగితే కొల్లాయిడ్ ద్రావణం ఏర్పడుతుంది. కొల్లాయిడ్ ద్రావణాలు విజాతి ద్రావణాలు. వీటిలో సాధారణంగా రెండు ప్రావస్థలు ఉంటాయి అవి విక్షిప్త ప్రావస్థ, విక్షెప ప్రావస్థ. విక్షిప్త ప్రావస్థని ఒక నిజ ద్రావణంలోని ద్రావితంతో సరిపొల్చవచు. దీనిని అంతర్ ప్రావస్థ అని కూడా వ్యవహరించవచ్చు. ఇది ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉండవచ్చు. విక్షెప ప్రావస్థని ఒక నిజ ద్రావణంలోని ద్రావణితో సరిపొల్చవచు. దీనిని బాహ్య ప్రావస్థ అని కూడా వ్యవహరించవచు. ఇది కూడా ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉండవచ్చు.

కొల్లాయిడ్ ద్రావణాలు వర్గీకరణ

[మార్చు]

కొల్లాయిడ్ ద్రావణాలను మూడు రకాలుగా వర్గీకరించారు అవి

విక్షెప యానకం ఆధారంగా

విక్షెప యానకం, విక్షిప్త ప్రావస్థ భౌతిక స్థితులను బట్టి కొల్లయిడ్స్ ను అనేక రకాలుగా వర్గికరించవచ్చు.

విక్షెప యానకం విక్షిప్త ప్రావస్థ పేరు ఉదాహరణ
వాయువు ద్రావం ఎయిరొసాల్ మేఘం, పొగమంచు
వాయువు ఘవపదార్ధం ఎయిరొసాల్ పొగ, ధూళి
ద్రావం వాయువు ఫొమ్ నురుగు
ద్రావం ద్రావం ఎమల్షన్ పాలు
ఘవపదార్ధం ద్రావం జెల్ పెరుగు
ఘవపదార్ధం ఘవపదార్ధం ఘనసాల్ రత్నాలు
  1. విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్యగల ఆపేక్ష ఆధారంగా కొల్లాయిడ్స్ ను రెండు రకాలుగా విభజింపవచ్చు, అవి లయోఫిలిక్ అనగ ద్రావణి ప్రియ, లయోఫొబిక్ అనగ ద్రావణీ విరోధ.లయోఫిలిక్ కొల్లాయిడ్లలో విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్య ఆపేక్ష అధికంగా ఉంటుంది. లయోఫొబిక్ కొల్లాయిడ్స్లలలో విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్య ఆపేక్ష అల్పంగా వుంతటుంది.
  2. విక్షిప్త ప్రావస్థ కణం మీది విద్యుదావేశం ఆధారంగా కొల్లాయిడ్స్ ను రెండు రకాలుగా విభజింపవచ్చు, అవి ధనావేశ సాల్, ఋణావేశ సాల్. ధనావేశ సాల్ లలో విక్షిప్త ప్రావస్థ కణం పై ధనావేశం ఉంటుంది. ఋణావేశ సాల్ లలో విక్షిప్త ప్రావస్థ కణం పై ఋణావేశం ఉంటుంది.

కొల్లాయిడ్ ద్రావణాలను తయారుచేయడం

[మార్చు]

కొల్లాయిడ్ ద్రావణాలను విక్షెపణం, సాంద్రీకరణం అను రెండు పధతులు ఉపయోగించి తయారుచేస్తారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]