Jump to content

కోచ్‌రబ్ ఆశ్రమం

వికీపీడియా నుండి

కోచ్‌రబ్ ఆశ్రమం భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, పౌర హక్కుల నేత మోహన్‌దాస్ కరం చంద్ గాంధీ నిర్వహించిన ఆశ్రమం. ఇది గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఆశ్రమం. దీనిని అతని స్నేహితుడు బారిస్టర్ జీవన్ లాల్ దేశాయ్ బహుమతిగా ఇచ్చాడు. [1] 1915 మే 25 న గాంధీజీ చే స్థాపించబడిన కోచ్‌రబ్ ఆశ్రమం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి సమీపంలో ఉంది.

ఈ ఆశ్రమం గాంధేయ వాదం ఆలోచనలను విద్యార్థులకు అందించి సత్యాగ్రహం, స్వయం సమృద్ధి, స్వదేశీ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండాఅ పేదలు, మహిళలు, అంటరానివారి అభ్యున్నతి కోసం పనిచేయడానికి, మెరుగైన ప్రభుత్వ విద్య, పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. మానవ సమానత్వం, స్వయంసేవ, నిరాడంబరత ఆధారంగా ఆశ్రమం నిర్వహించబడింది. ఏదేమైనా, కొచ్‌రబ్ ఆశ్రమం రెండు సంవత్సరాల తరువాత ప్లేగు బారిన పడినందున, గాంధీ తన ఆశ్రమాన్ని ఈసారి సబర్మతి నది ఒడ్డుకు మార్చవలసి వచ్చింది. సబర్మతి ఆశ్రమంలో ఉన్న సమయంలో ప్రజల గొంతుగా, దేశ నాయకుడిగా కీర్తి మరింత పెరిగింది. తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహం తరువాత గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమంలో తన మరణించే వరకు గడిపాడు.

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]