కోడూరి సత్యనారాయణ గౌడ్
కోడూరి సత్యనారాయణ గౌడ్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | న్యాలకొండ రామ కిషన్ రావు | ||
---|---|---|---|
తరువాత | సాన మారుతీ | ||
నియోజకవర్గం | చొప్పదండి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి |
కోడూరి సత్యనారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కోడూరి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి న్యాలకొండ రామ కిషన్ రావు పై పోటీ చేసి ఓడిపోయాడు. సత్యనారాయణ గౌడ్ 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. సత్యనారాయణ గౌడ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]
ఆయన 2024 మార్చి 30న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[4]
ఎమ్మెల్యేగా పోటీ
[మార్చు]సం. | నియోజకవర్గం | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2004 | చొప్పదండి | జనరల్ | సనా మారుతీ | పు | టీడీపీ | 45211 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 41096 |
1999 | చొప్పదండి | జనరల్ | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 54754 | న్యాలకొండ రామ కిషన్ రావు | పు | టీడీపీ | 52842 |
1994 | చొప్పదండి | జనరల్ | న్యాలకొండ రామ కిషన్ రావు | పు | టీడీపీ | 56287 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 30600 |
1989 | చొప్పదండి | జనరల్ | న్యాలకొండ రామ కిషన్ రావు | పు | టీడీపీ | 47783 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 39921 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (10 September 2018). "కాంగ్రెస్‌కు ఉహించని షాక్". Archived from the original on 2 April 2022. Retrieved 2 April 2022.
- ↑ Eenadu (4 December 2023). "ఎన్నాళ్లకెన్నాళ్లకు." Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Mana Telangana (12 September 2018). "టిఆర్ఎస్ లో చేరిన కోడూరి సత్యనారాయణ గౌడ్". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Andhrajyothy (31 March 2024). "కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.