కోణీయ వేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భౌతిక శాస్త్రంలో కోణీయ వేగం అంటే ఏదైనా కణం ఎంపిక చేసుకున్న కేంద్ర బిందువు చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుందో కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానం. కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతున్న కణం నిర్ణీత సమయంలో ఎంత కోణీయ దూరం ప్రయాణిస్తుందో దీన్ని ఉపయోగించి కొలుస్తారు. ఉదాహరణకు సూర్యుడి చుట్టూ భూమి ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కొలమానాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ప్రామాణిక కొలమానం (ఎస్. ఐ) ప్రకారం రేడియన్స్ పర్ సెకండ్ లో కొలుస్తారు. ఒమేగా గుర్తుతో (ω, కొన్నిసార్లు Ω) సూచిస్తారు. సాంప్రదాయం ప్రకారం ఈ విలువ ఋణాత్మకంగా ఉంటే సవ్య దిశలో తిరుగుతున్నట్టు, ధనాత్మకంగా ఉంటే అపసవ్య దిశలో తిరుగుతున్నట్లు భావిస్తారు.

మూలాలు[మార్చు]