Jump to content

కోమటి (కులం )

వికీపీడియా నుండి

కోమటి (కూమటి) అనేది దక్షిణ భారతదేశంలో నివసించే అతి పెద్ద వ్యాపార వర్గం. ఇది ప్రస్తుతం కులంగా పరిగణించబడుతుంది. కోమటి కులస్థులు సాధారణంగా డబ్బులు వడ్డీలకు తిప్పడం, సరుకులు అమ్మడం, కొనడం వంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కోమట్లలో హిందూ మతాన్ని పాటించే అనేక వర్గాలు ఉన్నాయి. చాలా మంది కోమటిలు శాఖాహారులుగా ఉంటారు.

పరిభాష

[మార్చు]

కోమటి అనే పేరు జైనలు దేవతగా పూజించే గోమాత నుండి తీసుకున్నారు అని చెప్తారు. ఈ సిద్ధాంతాన్ని సి. ద్వారకానాథ్ గుప్తా జైసెట్టి రమణయ్య వంటి పండితులు కూడా సమర్థించారు; బి.ఎస్.ఎల్. హనుమంత రావు కూడా దీనిని అత్యంత సహజమైనది గా పేర్కొన్నారు, గుప్త సిద్ధాంతం ప్రకారం కోమటిలు మొదట బెంగాల్‌లోని గౌడ కులం నుండి వచ్చిన వ్యాపారులు, వారు జైనమతాన్ని స్వీకరించారు.

గోదావరి నది తీరమైన గోమతి ఒడ్డున కోమటిలు మొదట నివసించారని చెబుతారు. కొను-అమ్ము అనే తెలుగు పదాల నుండి కోమటి అనే పేరు ఆవిర్భవించింది అని మరొక సిద్ధాంతం పేర్కొంది. సంస్కృత పదం "గోమతి" నుండి "కోమటి" అనే పదం వాడుకలోకి వచ్చిందని చెపుతారు, కోమటి అంటే ఆవులను కలిగి ఉన్నవారు లేదా సాదేవారు లేదా కో-మతి ("నక్క మనస్సు గలవారు") అనే అర్థం ఉందని నమ్ముతారు, ఇది వారి వ్యాపార చతురతను సూచిస్తుంది. సమాజంలో చాలా మంది అంగీకరించిన మూల కథ కన్యకా పురాణంలో కూడా ఇది ప్రస్తావించబడింది, శివుడు వారికి గో-మతి ("ఆవు-మనస్సు") అనే పేరు పెట్టాడని శాస్త్రం పేర్కొంది.

చరిత్ర

[మార్చు]

విజయనగర సామ్రాజ్య కాలంలో గోదావరి, కృష్ణా  గుంటూరు జిల్లాలలో "పెనుగొండ ప్రభువులు" అమలు చేసిన 11 వ శతాబ్దం శాసనాలు ఉన్నాయి. కోమటిలలో సంపన్న వర్గాలను సెట్టి, చెట్టి అని లేదా చెట్టియార్ అని పిలుస్తారు, ఈ పదాలు అన్నీ సంస్కృత పదం శ్రేష్ఠి నుండి తీసుకున్నారు, వీరు తమ వ్యాపారాలను కొనసాగించడానికి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు, దక్షిణ భారతదేశ వాణిజ్యంలో ప్రముఖ వ్యాపారులుగా పేరు గడించారు, హిందూ కుల వ్యవస్థలో మూడవ అత్యున్నత వర్ణమైన వైశ్యులుగా పరిగణించబడాలని కోరుకున్నారు. ఈ సమయంలో వైశ్య హోదా కోసం కోమటి, బలిజల మధ్య పోటీ నెలకొంది.

ఆర్య వైశ్య

[మార్చు]

ఆర్య వైశ్యులు సాంప్రదాయకంగా శాఖాహారులు; ఆర్య వైశ్యులు మాంసహారనికి వ్యతిరేకం, ఆర్య వైశ్య లేదా వైశ్య అనేది కోమటి కులానికి చెందిన ఉపసమితి. 2017 నాటికి, భారతదేశంలో సుమారు 22,952,000 మంది ఆర్య వైశ్యులు ఉన్నారు. సాంప్రదాయకమైన ఆర్య వైశ్యులు మధ్యయుగంలో రాసిన వారి మత గ్రంథమైన వాసవీ పురాణంలో సూచించిన ఆచారాలను పాటిస్తారు. గతంలో కోమట్లను చెట్టియార్లు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు ఆర్య వైశ్యులుగా పిలుస్తున్నారు.

కళింగ వైశ్య

[మార్చు]

కళింగ వైశ్యులు "వైష్ణవ  శైవ శాఖలకు చెందిన దేవతలను ఎక్కువగా ఆరాధిస్తారు". కళింగ వైశ్యులు పాత కళింగ దేశంలోని విశాఖపట్నం నుండి "ఒరిస్సా రాష్ట్రంలోని సమీప ప్రాంతాల వరకు" కనిపిస్తారు.

త్రివర్ణిక వైశ్య

[మార్చు]

త్రివర్ణిక వైశ్యులు తమను తాము త్రివర్ణిక వైష్ణవ స్వరూపులుగా పిలుచుకుంటారు. తమ సంఘం 11వ శతాబ్దంలో రామానుజుల కాలంలోనే ప్రారంభమైందని నమ్ముతారు.

చెట్టియార్లు

[మార్చు]

ఉత్తరాది శెట్టి వారు తమను తాము చెట్టియార్లుగా ముద్ర వేసుకున్నారు.

జనాభా శాస్త్రం

[మార్చు]

ఆర్య వైశ్యులు కోమటిలలో అతిపెద్ద శాఖ, కళింగ వైశ్యులు రెండవ అతిపెద్ద ఉపశాఖ. త్రివర్ణిక వైశ్యులు, ఆర్య వైశ్యులు కళింగ వైశ్యుల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  • "Brief Report: Pseudocholinesterase Deficiency in an Indian Community". 3 (1). Journal of Pharmacy Practice and Community Medicine. 2017. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  • "Political Emblems of Caste Identity: An Interpretation of Tamil Caste Titles". 56. The George Washington University Institute for Ethnographic Research. October 1983. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  • "Proceedings of the Indian History Congress". 69. Indian History Congress. 2008. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  • Singh, Kumar Suresh (1996). Communities, segments, synonyms, surnames and titles. People of India: National series. Vol. 8. Anthropological Survey of India/Oxford University Press. ISBN 9780195633573.
  • Sreenath, J.; Ahmad, S. H. (1989). All India anthropometric survey: analysis of data. South Zone. Vol. 1. Anthropological Survey of India. Anthropological Survey of India/Oxford University Press.
  • Hiebert, Paul G. (1971). Konduru: Structure and Integration in a South Indian Village. University of Minnesota Press. ISBN 9780816657872.
  • Srinivasulu, K. (September 2002). Caste & Class Articulation of Andhra Pradesh (PDF). London: Overseas Development Institute. pp. Glossary of castes, 4. ISBN 0-85003-612-7. Archived from the original (PDF) on 20 జూలై 2006. Retrieved 20 December 2011.

బాహ్య లింకులు

[మార్చు]