కౌశంబి భట్
కౌశంబి భట్ | |
---|---|
జననం | రాజ్‌కోట్, గుజరాత్ | 1991 అక్టోబరు 1
వృత్తి | నటి |
కౌశంబి భట్, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హెల్లారో (2019), ధుంకీ (2019), మోంటు నీ బిట్టు (2019) వంటి గుజరాతీ సినిమాలలో నటించింది.
జీవిత చరిత్ర
[మార్చు]కౌశంబి భట్, 1991 అక్టోబరు 1న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది. రాజ్‌కోట్‌లో పాఠశాల విద్యను, అహ్మదాబాద్‌లోని జిఎల్ఎస్ కళాశాలలో కళాశాల విద్యను పొందింది. అహ్మదాబాద్ లోని గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేసింది.[1]
సినిమారంగం
[మార్చు]2019లో గుజరాతీ పీరియడ్ డ్రామా సినిమా హెల్లారోలో తొలిసారిగా నటించింది. ఈ సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2] కౌశంబి తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును పొందింది.[3][4] విజయగిరి బావ తీసిన రొమాంటిక్ కామెడీ మోంటు నీ బిట్టు, అనీష్ షా తీసిన ధుంకీ సినిమాలో నటించింది.[5][6]
కాళు ఎట్లే అంధారు అనే గుజరాతీ నాటకంలో తన పాత్రకు గుర్తింపు కూడా పొందింది.[5]
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ప్రత్యేక జ్యూరీ అవార్డు | హెల్లారో | గెలుపు | [7] |
2019 | గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డు | ఉత్తమ సహాయ నటి | ధుంకి | గెలుపు | [1][8] |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2019 | హెల్లారో | చంపా |
2019 | ధుంకి | అంకిత |
2019 | మోంటు నీ బిట్టు | సౌభాగ్యలక్ష్మి |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Upadhyay, Akshay (2020-06-02). "If there is a will, there is a way – Kaushambi Bhatt". The Story Behind Name. Archived from the original on March 27, 2022. Retrieved 2022-04-11.
- ↑ Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2022-04-11.
- ↑ "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
- ↑ "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
- ↑ 5.0 5.1 "Kaushambi Bhatt". Book My Show.
- ↑ "Celebration time for Anish Shah's 'Dhunki' as it turns one today". The Times of India. 2020-07-28. Retrieved 2022-04-11.
- ↑ "66th National Film Awards" (PDF). dff.gov.in. Archived from the original (PDF) on 2019-08-09. Retrieved 2022-04-11.
- ↑ "અમદાવાદમાં યોજાયો ગુજરાત આઇકોનિક ફિલ્મ એવાર્ડ, ગુજરાતી ફિલ્મ કલાકારો ચમક્યા!". Gujarat Inside. 2019-12-26. Retrieved 2022-04-11.[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కౌశంబి భట్ పేజీ