క్రయోజెనిక్స్
అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థాల, వాయువుల ధర్మాలను అధ్యయనం చేయు శాస్త్రమే క్రయోజెనిక్స్. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థంలోని పరమాణువులు దాదాపు నిశ్చల స్థితికి వస్తాయి. కాబట్టి పదార్థ గట్టిదనాన్ని, విద్యుత్ నిరోధాన్ని, ఉష్ణ వాహక తత్వాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు.
1971 లో వాషింగ్టన్ డి.సి లో జరిగిన 13వ అంతర్జాతీయ రిఫ్రెజిరేషన్ సంస్థ సదస్సులో సాధారణ రిఫ్రెజిరేషన్ నుంచి క్రయోజెనిక్స్‌ని వేరు చేయడం కోసం ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం 120 కెల్విన్ (అంటే -153 °సెల్సియస్) లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలను క్రయోజెనిక్ ఉష్ణోగ్రతగా నిర్ణయించారు.[1][2][3][4] ఏ పదార్థమైననూ -273° సెల్సియస్ కంటే తగ్గించడం సాధ్యం కాదు, దీన్నే పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత అని కూడా అంటారు. కెల్విన్ మాపకంలో ఇది సున్నాకు సమానం.
కామర్లింగ్ ఓన్స్ (Heike Kamerlingh Onnes) : 1911 తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థ విద్యుత్ నిరోధం పూర్తిగా కోల్పోతుందని కనుగొన్నాడు. ఈ ధర్మాన్నే అతివాహకత్వము (Super Conductivity) అంటారు. ఈ రంగంలో విశేష కృషి చేసినందులకు ఇతనికి 1913 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.[5]
ఉపయోగాలు
[మార్చు]- సహజ వాయువును ద్రవీకరించవచ్చు
- ఆహారాన్ని అత్యధిక కాలం పాటు నిలవ చేయవచ్చు
- శరీరంలోని అనారోగ్య కణాలను గడ్డకట్టించవచ్చు
- మెదడులోని భాగాన్ని గడ్డకట్టించి వ్యాధులకు చికిత్స చేయవచ్చు
పురోగతి
[మార్చు]- 1877 లో తొలిసారిగా ఆక్సిజన్ను -183 డిగ్రీ సెల్సియస్ లకు తగ్గించారు
- 1895 లో పదార్థ ఉష్ణోగ్రతను -233 డిగ్రీ సెల్సియస్ లకు తగ్గించారు
- 1920 వ దశకంలో సున్నా కెల్విన్ ఉష్ణోగ్రతను దాదాపుగా (0.000001) సాధించగల్గారు
- 1981 లో తొలిసారిగా అంతరిక్ష నౌకలలో క్రయోజెనిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టగల్గినారు.
మూలాలు
[మార్చు]- ↑ International Dictionary of Refrigeration, http://dictionary.iifiir.org/search.php, Archived 2019-10-01 at the Wayback Machine.
- ↑ ASHRAE Terminology, https://www.ashrae.org/technical-resources/free-resources/ashrae-terminology.
- ↑ "Cryogenics is usually defined as the science and technology dealing with temperatures less than about 120 K [4, 5], although this review does not adhere to a strict 120 K definition." K. D. Timmerhaus, R. Reed. Cryogenic Engineering: Fifty Years of Progress. Springer Science+Business Media LLC (2007), chapter: 1.2, The Beginning of Cryogenics, p. 7.
- ↑ "About Cryogenics".
In terms of the Kelvin scale the cryogenic region is often considered to be that below approximately 120 K (−153 C).
- ↑ "The Nobel Prize in Physics 1913". Nobel Foundation. Archived from the original on 19 September 2008. Retrieved 9 October 2008.