క్రెయిగ్ షూమేకర్
క్రెయిగ్ షూమేకర్ | |
---|---|
జననం | ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, యుఎస్ | 1964 నవంబరు 15
మాధ్యమం | స్టాండ్-అప్, టెలివిజన్, సినిమా, పుస్తకాలు |
క్రియాశీలక సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
కళలు | పరిశీలనాత్మక కామెడీ |
భార్య లేక భర్త | కరోలిన్ ఆన్ క్లార్క్ (m. 1998; div. 2005) మికా షూమేకర్
(m. 2008) |
పిల్లలు | 4 |
క్రెయిగ్ షూమేకర్ అమెరికన్ స్టాండ్ అప్ హాస్యనటుడు, రచయిత, నిర్మాత. అతను ఎబిసిలో ది అమెరికన్ కామెడీ అవార్డ్స్ లో హాస్యనటుడిగా ఎంపికయ్యాడు. రెండు నాటాస్ ఎమ్మీ అవార్డులను పొందాడు. తన 90 నిమిషాల స్టాండ్ - అప్ స్పెషల్ డాడిట్యూడ్ కు ప్రసిద్ధి చెందాడు.
జననం
[మార్చు]క్రెయిగ్ 1964, నవంబరు 15న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత టెంపుల్ యూనివర్సిటీలో చేరాడు. తన కళాశాల వార్షికోత్సవాలలో బార్టెండర్ గా, కామెడీ షోల కోసం ఎంసీగా పనిచేశాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కూడా చదివాడు. క్రెయిగ్ రేడియో, టెలివిజన్, సినిమాల్లో మేజర్స్ తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నటి కరోలిన్ ఆన్ క్లార్క్ తో క్రెయిగ్ వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు జస్టిన్, జారెడ ఉన్నారు. అయితే కరోలిన్ ఆన్ క్లార్క్, క్రెయిగ్ విడాకులు తీసుకున్నారు.[1] తరువాత మికా ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు (జాక్సన్), ఒక కుమార్తె (క్లోయ్) ఉన్నారు.[2]
2012లో కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి హ్యుమానిటీస్/హ్యుమనిస్టిక్ లో గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[3]
సినిమాలు
[మార్చు]- లవ్ మాస్టర్
- సేఫ్ హౌస్
- ప్లెసెంట్‌విల్లే
- క్రెయిగ్ షూమేకర్: ది లవ్‌మాస్టర్
- మిడిల్ మ్యాన్
మూలాలు
[మార్చు]- ↑ Shoemaker deals big dose of 'Daditude'. San Antonio Express-News
- ↑ Shoemaker, Craig (2014). Lovemaster'd: a digital journey to love and happiness. Victoria, BC: FriesenPress. ISBN 978-1-4602-4459-3.
- ↑ Staff report (March 29, 2012). College graduation commencements announced. Pittsburgh Post-Gazette