క్లాడెట్ కోల్బర్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లాడెట్ కోల్బర్ట్
క్లాడెట్ కోల్బర్ట్ (1950)
జననం
ఎమిలీ క్లాడెట్ చౌచోయిన్

(1903-09-13)1903 సెప్టెంబరు 13
సెయింట్-మాండే, ఫ్రాన్స్‌
మరణం1996 జూలై 30(1996-07-30) (వయసు 92)
స్పీట్‌స్టౌన్, బార్బడోస్
సమాధి స్థలంగాడింగ్స్ బే చర్చి స్మశానవాటిక, స్పెయిట్స్‌టౌన్
13°14′28″N 59°38′32″W / 13.241235°N 59.642320°W / 13.241235; -59.642320
జాతీయతAmerican
ఇతర పేర్లులిల్లీ క్లాడెట్ చౌచోయిన్
విద్యవాషింగ్టన్ ఇర్వింగ్ హై స్కూల్ (న్యూయార్క్ సిటీ)
విద్యాసంస్థఆర్ట్ స్టూడెంట్స్ లీగ్ ఆఫ్ న్యూయార్క్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1925–1987
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)
జీవిత భాగస్వామి
నార్మన్ ఫోస్టర్ (దర్శకుడు)
(m. 1928; div. 1935)
జోయెల్ ప్రెస్‌మాన్
(m. 1935; died 1968)

క్లాడెట్ కోల్బర్ట్ (1903 సెప్టెంబరు 13 – 1996 జూలై 30) అమెరికన్ నాటకరంగ, సినిమా నటి. 1920ల చివరలో బ్రాడ్‌వే నాటకాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో పారామౌంట్ పిక్చర్స్‌ సంస్థతో కలిసి పనిచేసింది. 1934లో వచ్చిన ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్ సినిమాతో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది, మరో రెండు అకాడమీ అవార్డులకు నామినేట్ అయింది. 1934లో వచ్చిన క్లియోపాత్రా, 1942లో వచ్చిన ది పామ్ బీచ్ స్టోరీ సినిమాలు కోల్బర్ట్ నటించిన ఇతర ప్రముఖ సినిమాలు.

జననం

[మార్చు]

క్లాడెట్ కోల్బర్ట్ 1903, సెప్టెంబరు 13న జీన్ మేరీ - జార్జెస్ క్లాడ్ చౌచోయిన్‌ దంపతులకు ఫ్రాన్స్‌లోని సెయింట్-మాండేలో జన్మించింది.[1][2] [3]

నటనారంగం

[మార్చు]

గుండ్రని ముఖం, పెద్ద కళ్ళు, హాస్యం, భావోద్వేగ నటనలోని మెళుకువలతో,[4] తన బహుముఖ ప్రజ్ఞతో 1938, 1942లలో[5] అత్యధిక పారితోషికం అందుకున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది.[2] కోల్బర్ట్ 60కి పైగా సినిమాల్లో నటించింది. ఫ్రెడ్ మాక్‌ముర్రేతో ఏడు సినిమాలలో (1935-1949), ఫ్రెడ్రిక్ మార్చ్ తో నాలుగు సినిమాలలో (1930-1933) కలిసి నటించింది.

1950ల ప్రారంభంలో, కోల్‌బర్ట్ సినిమా నుండి నుండి టెలివిజన్, నాటకరంగం వైపు వచ్చింది. 1959లో ది మ్యారేజ్-గో-రౌండ్ సినిమా కోసం టోనీ అవార్డుకు నామినేట్ అయింది. 1960ల ప్రారంభంలో తన కెరీర్ తగ్గింది, అయితే 1970ల చివరలో, అది నాటకరంగంలో గుర్తింపు పొందింది. 1980లో చికాగో నాటకరంగంలో కృషికి సారా సిడాన్స్ అవార్డును అందుకుంది. 1987లో వచ్చిన గ్రెన్‌విల్లెస్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది, ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయింది.

1999లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌బర్ట్‌ను క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లో 12వ గొప్ప మహిళా తారగా పేర్కొంది.

సినిమాలు (కొన్ని)

[మార్చు]
 • ది హోల్ ఇన్ ది వాల్ (1929)
 • యంగ్ మాన్ ఆఫ్ మాన్హాటన్ (1930)
 • మాన్స్లాటర్ (1930)
 • హానర్ అమూండ్ లవర్స్ (1931)
 • సీక్రెట్స్ ఆఫ్ సెక్రటరీ (1931)
 • ది వైజర్ సెక్స్ (1932)
 • మిస్లీడింగ్ లేడీ (1932)
 • ది మ్యాన్ ఫ్రమ్ ఎస్టర్ డే (1932)
 • టునైట్ ఈజ్ అవర్స్ (1933)
 • త్రీ కార్నర్డ్ చంద్రుడు (1933)
 • టార్చ్ సింగర్ (1933)
 • ఫోర్ ఫ్రిఘ్టెండ్ పీపుల్ (1934)
 • ఇట్ హాపెండ్ వన్ నైట్ (1934)
 • క్లియోపాత్రా (1934)
 • ఇమిటేషన్ ఆఫ్ లైఫ్ (1934)
 • ది గిల్డెడ్ లిల్లీ (1935)
 • ప్రైవేట్ వరల్డ్స్ (1935)
 • షీ మ్యారీడ్ హర్ బాస్ (1935)
 • ది బ్రైడ్ కమ్స్ హోమ్ (1935)
 • మెయిడ్ ఆఫ్ సేలం (1937)
 • ఐ మెట్ హిమ్ ఇన్ పారిస్ (1937)
 • తోవరిచ్ (1937)
 • జాజా (1939)
 • మిడ్ నైట్ (1939)
 • ఇట్స్ ఎ వండర్ఫుల్ వరల్డ్ (1939)
 • డ్రమ్స్ అలాంగ్ ది మోహాక్ (1939)
 • ఎరైజ్, మై లవ్ (1940)
 • స్కైలార్క్ (1941)
 • రిమెంబర్ ది డే (1941)
 • ది పామ్ బీచ్ స్టోరీ (1942)
 • నో టైమ్ ఫర్ లవ్ (1943)
 • కాబట్టి ప్రౌడ్లీ వుయ్ హెల్! (1943)
 • సిన్స్ యు వెంట్ అవే (1944)
 • ప్రాక్టికల్లీ యువర్స్ (1944)
 • గెస్ట్ వైఫ్ (1945)
 • టుమారో ఈజ్ ఫరెవర్ (1946)
 • వితౌట్ రిజర్వేషన్స్ (1946)
 • ది సీక్రెట్ హార్ట్ (1946)
 • ది ఎగ్ అండ్ ఐ (1947)
 • స్లీప్, మై లవ్ (1948)
 • ఫ్యామిలీ హనీమూన్ (1949)
 • బ్రైడ్ ఫ్ సేల్ (1949)
 • త్రీ కేమ్ హోమ్ (1950)
 • ది సీక్రెట్ ఫ్యూరీ (1950)
 • థండర్ ఆన్ ది హిల్ (1951)
 • లెట్స్ మేక్ ఇట్ లీగల్ (1951)
 • ది ప్లాంటర్స్ వైఫ్ (1952)
 • టెక్సాస్ లేడీ (1955)

మరణం

[మార్చు]

కోల్బర్ట్ తన జీవితంలోని చివరి మూడు సంవత్సరాలలో చిన్నచిన్న స్ట్రోక్‌లను ఎదుర్కొన్నది. తన 92 ఏళ్ళ వయస్సులో 1996, జూలై 30న బార్బడోస్‌లో మరణించింది.[2] అంత్యక్రియలలు, దహన సంస్కారాలు న్యూయార్క్ నగరంలో జరిగాయి.[6]

అవార్డులు, సన్మానాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూలాలు
1935 అకాడమి పురస్కారం ఉత్తమ నటి ఇట్ హాపెండ్ వన్ నైట్ విజేత [7]
1936 ప్రైవేట్ వరల్డ్స్ నామినేట్ [8]
1945 సిన్స్ యు వెంట్ అవే నామినేట్ [9]
1959 టోనీ అవార్డు ఉత్తమ నటి ది మ్యారేజ్-గో-రౌండ్ నామినేట్
1960 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 6812 హాలీవుడ్ స్టార్ విజేత [10]
1980 సారా సిడన్స్ అవార్డు ది కింగ్‌ఫిషర్ విజేత [11]
1984 ఫిల్మ్ సొసైటీ ఆఫ్ లింకన్ సెంటర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేత [12]
1985 డ్రామా డెస్క్ డ్రామా డెస్క్ ప్రత్యేక అవార్డు ఆర్ నాట్ వుయ్ ఆల్ విజేత [13]
1987 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు అత్యుత్తమ సహాయ నటి ది టూ మిస్సెస్ గ్రెన్విల్లెస్ నామినేట్
1988 గోల్డెన్ గ్లోబ్ అవార్డు సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి విజేత
1989 కెన్నెడీ సెంటర్ ఆనర్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేత [14]
1990 శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డోనోస్టియా అవార్డు విజేత [15]
1999 అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గొప్ప మహిళా తారలు విజేత [16]

 

మూలాలు

[మార్చు]
 1. COLBERT, Claudette, British Film Institute. BFI.org.uk.
 2. 2.0 2.1 2.2 Pace, Eric (July 31, 1996). "Claudette Colbert, Unflappable Heroine of Screwball Comedies, Is Dead At 92". The New York Times. Retrieved 2023-05-20.
 3. Quirk, "Claudette Colbert", p. 5.
 4. "Claudette Colbert profile". TCM. Retrieved 2023-05-20.
 5. "Claudette Colbert – Britannica Concise". Retrieved 2023-05-20.
 6. "A Perfect Star". Vanity Fair. January 1998. Retrieved 2023-05-20.
 7. "The 7th Academy Awards (1935) Nominees and Winners". Academy of Motion Picture Arts and Sciences (AMPAS). Retrieved 2023-05-20.
 8. "The 8th Academy Awards (1936) Nominees and Winners". Academy of Motion Picture Arts and Sciences (AMPAS). Retrieved 2023-05-20.
 9. "The 17th Academy Awards (1945) Nominees and Winners". Academy of Motion Picture Arts and Sciences (AMPAS). Retrieved 2023-05-20.
 10. "Walk of Fame Stars-Claudette Colbert". Hollywood Chamber of Commerce. Archived from the original on April 3, 2016. Retrieved 2023-05-20.
 11. "Sarah Siddons Society Awardees". Archived from the original on November 7, 2008. Retrieved 2023-05-20.
 12. Robertson, Nan. "Film Society of Lincoln Center". The New York Times. Retrieved 2023-05-20.
 13. Drama Desk Award winners Archived అక్టోబరు 20, 2006 at Archive.today
 14. "The Kennedy Center, Biography of Claudette Colbert". Archived from the original on January 6, 2008. Retrieved 2023-05-20.
 15. "Archive of awards, juries and posters". San Sebastián International Film Festival. Archived from the original on February 9, 2012. Retrieved 2023-05-20.
 16. "AFI's 100 Years, 100 Stars, American's Greatest Legends" (PDF). American Film Institute. Retrieved 2023-05-20.

బయటి లింకులు

[మార్చు]