క్లైనీఫెల్టర్ సిండ్రోమ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ (Klinefelter's syndrome) లో పురుషులలో మామూలుగా ఉండే XY క్రోమోజోములకు అదనంగా ఒక X క్రోమోజోము చేరుతుంది. వీరికి మొత్తం 47 క్రోమోజోములు ఉంటాయి. ఈ సిండ్రోమ్ గురించి హెచ్.ఎఫ్. క్లైనీఫెల్టర్ {H. F. Klinefelter) మొదటిసారిగా 1942లో వివరించాడు. ఒక అరుదైన XX అండము Y శుక్రకణంతో గాని, లేదా X అండము ఒక అరుదైన XY శుక్రకణంతో గాని ఫలదీకరణ (Fertilization) చెందితే ఈ XXY పరిస్థితి ఏర్పడుతుంది. సుమారు 500 మంది మగ శిశువుల్లో ఒకరు ఈ జన్యు వ్యాధికి గురి అవుతారు.

లక్షణాలు[మార్చు]

ఈ వ్యాధి గల వ్యక్తులు శారీరకంగా స్త్రీ లక్షణాలను కలిగివుంటారు. పెరిగిన వక్షోజాలు, హెచ్చు శృతిగల కంఠస్వరం, పొడవైన కాళ్ళు, చేతులు, కొట్టుకునే మోకాళ్ళు, పలుచగా ఉన్న దేహ రోమాలు, చిన్న పౌరుష గ్రంధి, చిన్న ముస్కములు మున్నగు లక్షణాలుంటాయి. వీరికి ఫలదీకరణ సామర్ధ్యం ఉండదు. వీరిని దృశ్యరూప పురుషులు (Phenotypic males) అంటారు.