Jump to content

క్లోనింగ్

వికీపీడియా నుండి
డాలీని ఉత్పత్తి చేసిన క్లోనింగ్ ప్రక్రియ
మొదటి క్లోనింగ్ గొర్రె పిల్ల డాలీ

జీవశాస్త్రంలో క్లోనింగ్ అనగా జన్యుపరంగా సారూప్య ఉత్పత్తి ప్రక్రియ, ఈ విధానంలో అలైంగిక పద్ధతి ద్వారా ప్రకృతిలో ఉన్న బాక్టీరియా, కీటకాలు లేక మొక్కలు వంటి జీవుల నుంచి అదే రూపం కలిగిన కొత్త జీవులను పునరుత్పత్తి చేస్తారు. క్లోన్ అంటే ప్రతిరూపం, ప్రతిరూపాన్ని తయారు చేయడాన్నే క్లోనింగ్ అంటారు. ప్రతి జీవి జీవకణాల (సెల్స్) తో రూపొంది ఉంటాయి. జీవిలో ఉండే జీవకణాలలో ప్రధానమైనవి అని రెండు అని అనుకుంటే వాటిలో ఒకటి సోమాటిక్ జీవకణం (సెల్), రెండోవది జెర్మ్ జీవకణం (సెల్), వీటిలో జెర్మ్ జీవకణాలు పునరుత్పత్తి కణాలు. జెర్మ్ జీవకణాలు ఆడ జాతిలో ఉంటే వాటిని అండ కణాలనీ, మగ జాతిలో ఉంటే శుక్ర కణాలనీ పిలుస్తారు. ఈ జెర్మ్ కణాలను మినహా ఇస్తే మిగతా శరీరమంతా ఉండే కణాలను సోమాటిక్ కణాలు అంటారు. ప్రతి కణంలోను కేంద్రకం (న్యూక్లియస్) ఉంటుంది. ప్రతి కణ కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. అయితే సోమాటిక్ కణాల కేంద్రకంలో క్రోమోజోములు జతలుగా ఉంటాయి, జెర్మ్ కణాల కేంద్రకంలో క్రోమోజోములు ఒంటరిగా ఉంటాయి. మామూలుగా సంతానోత్పత్తి జరిగేటప్పుడు ఆడ, మగ జాతుల కలయిక వలన ఆడ జాతిలో ఉన్న అండ కణాలు (ఒంటరి క్రోమోజోములు), మగ జాతిలో ఉన్న శుక్ర కణాలు (ఒంటరి క్రోమోజోములు) కలిసి జతగా ఏర్పడటాన్నే పిండం ఏర్పడటమంటారు. పిండం కణ విభజన చెందుతూ పెరిగి శిశువుగా రూపొందుతుంది. క్లోనింగ్ పద్ధతిలో కొత్త జీవిని పుట్టించడానికి ఆడజాతికి చెందిన జీవి అండకణంలోని ఒంటరి క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని తొలగించి, అండ కణ కవచాన్ని మాత్రమే మిగులుస్తారు. ఆ తరువాత ఆడ లేక మగ జాతుల నుంచి సోమాటిక్ కణాన్ని తీసుకొని అందులో జంట క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని వేరు చేసి జంట క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని క్రోమోజోములు లేని అండ కణ కవచంలో ప్రవేశపెడతారు. ఇప్పుడు ఈ అండ కణం జంట క్రోమోజోములున్న కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు జంట క్రోమోజోముల కేంద్రకాన్ని కలిగి ఉన్న అండ కణానికి కొన్ని రసాయనిక పరీక్షలు జరపటం ద్వారా అండ కణం పిండ కణంగా మార్పు చెందుతుంది. తరువాత ఈ పిండ కణాన్ని ఆడ జీవి అండాశయంలో ఉంచుతారు. తరువాత పిండ కణం కణవిభజన జరుగుతూ శిశువుగా పెరుగుతుంది. తరువాత మామూలు గర్భధారణ సమయం తరువాత జరిగే ప్రసవం లాగే ప్రసవం జరిగి క్లోనింగ్ శిశువు జన్మిస్తుంది. ఈ క్లోనింగ్ శిశువు ఏ జీవి నుంచి సోమాటిక్ జీవకణాన్ని సేకరించామో ఆ జీవి పోలికలను కలిగి ఉంటుంది.

క్లోనింగ్ ఇతర వాడుకలు

[మార్చు]

క్లోనింగ్ అనగా ప్రతిరూపాన్ని తయారు చేయటం కనుక కొన్ని వస్తువులను అదే రూపంతో తయారు చేయటాన్ని క్లోనింగ్ చేయటం అంటారు.

alltechgeek

క్లోనింగ్ ప్రక్రియ లోపాలు, విమర్శలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]