Jump to content

క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
వికీపీడియా నుండి
క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం
ఆలయ గోపురం
ఆలయ గోపురం
క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం
క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:ముక్తేశ్వరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో ఈ దేవాలయం ఉంది.

స్ధల పురాణం

[మార్చు]

గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం.రావణ వధ తర్వాత ఆ బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీ రాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు .ఒక సారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగి పోయింది .అక్కడ దిగి నడుచు కుంటూ వెళ్లితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరు మిట్లు గొలిపే కాంతితో దర్శన మిచ్చింది .దానికి దగ్గరలో’’ శ్రమణి ‘’అనే తాపసి ధ్యానంలో కనిపించింది .రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామ దర్శనం చేత తనకు శాప విమోచనమైఁదని తెలిపింది .పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు .వెంటనే పరమేశ్వరుడు దానినుండి ప్రత్యక్షమయ్యాడు .తాపసి శ్రమణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమై పోయింది . శ్రీ రాముని కోర్కపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు .ఒక్కక్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణ ముక్తేశ్వర క్షేత్రమయింది .శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తడయ్యాడు .కనుక ఆలయం త్రేతా యుగానికి చెందినది .సప్తమహర్షులు ఇక్కడ కొచ్చి స్వామిని అర్చించారు .క్షేత్రపాలకుడు కేశవ స్వామి .శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాసాలలో, శివరాత్రికి విశేషంగా పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి .[1]

ఉత్సవాలు

[మార్చు]

రవాణా సౌకర్యం

[మార్చు]

రవాణా సదుపాయం ఉంది.ముక్తేశ్వర ఆలయం అమలాపురం నుండి 10కిలోమీటర్ల, కాకినాడకు 60కిలోమీటర్ల దూరంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "ముక్తిని ప్రసాదించే ముక్తీశ్వరుడు!." m.ap7am.com. Archived from the original on 2020-02-24. Retrieved 2020-02-24.