Jump to content

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని

వికీపీడియా నుండి

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి అనేది ఒక ప్రసిద్ధిచెందిన కీర్తన.

దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన అన్నమాచార్యులు రచించారు. ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణైన అలమేలు మంగకు నీరాజనం అనగా హారతి ఇస్తూ కీర్తిస్తాడు.

ఈ కీర్తనను శంకరాభరణం జన్యమైన కురింజి రాగం, ఖండచాపు తాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన

[మార్చు]

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని - నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు - నెలకొన్న కప్పురపు నీరాజనం

అలివేణి తురుమునకు హస్త కమలంబులకు - నిలువు మాణిక్యముల నీరాజనం

పగటు శ్రీ వేంకటేశుని పట్టపు రాణియై - నెగడు సతి కళలకును నీరాజనం

జగతి అలమేలు మంగ చక్కదనముల కెల్ల - నిగుడు నిజ శోభనపు నీరాజనం

చరణ కిసలయములకు సఖియంభోరులకు - నిరతము ముట్టెల నీరాజనం

అరిడి జఘనంబునకు అతివ నిజనాభికి - నిరతి ననవర్ణ నీరాజనం

భారతీయ సంస్కృతి

[మార్చు]

పూర్తి పాఠం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కర్ణాటిక్ సైట్ లో క్షీరాబ్ధి కన్యకకు కీర్తన సాహిత్యం". Archived from the original on 2011-09-22. Retrieved 2011-10-25.
  2. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేసిన కీరాబ్ధి కన్యకకు కీర్తన.