ఖంధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంస్కృత శబ్దం స్కంధం. సమూహం అని ఒక అర్థం. బౌద్ధం మనిషిలోని ఐదు స్కంధాలను గుర్తిస్తుంది. అవి: రూప, వేదనా, విజ్ఞాన, సంజ్ఞా, సంస్కారాలని ‘శబ్దరత్నాకరం’ తెలియ జేస్తుంటే, సింగపూర్‌ బుద్ధిస్ట్‌ మెడిటేషన్‌ సెంటర్‌ ప్రచురించిన ‘బుద్ధిస్ట్‌ డిక్షనరీ’ ఇచ్చిన ఐదు పదాలు ఇలా ఉన్నాయి: రూప ఖంధ, వేదనా ఖంధ, సంజ్ఞా ఖంధ, సంఖార ఖంధ, విజ్ఞాన ఖంధ. ‘రూప ఖంధ’లో సమస్త భౌతిక వస్తుజాలం ఉంది. నాలుగు మహాభూతాలతో కూడినవి, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు కలసిన పదార్థాలు/ వస్తువులు. వేదనలో ఆరు విధాలైన చిత్త వ్యాపారాలు ఉంటాయి. చూస్తే, వింటే, ఆఘ్రాణిస్తే, తింటే, స్పర్శిస్తే, మనస్సును కదిలిస్తే కలిగే భావాలన్నీ ‘వేదనా ఖంధ’లోనివి. ‘సంజ్ఞాఖంధ’లో దృశ్యాలు, శబ్దాలు మొదలైన (ఇంద్రియ జనిత) చిత్తానుభూతులు ఉంటాయి. అలాగే సంఖార, విజ్ఞాన ఖందాలకు బౌద్ధవాఙ్మయం వివరణలు ఇస్తుంది. సంఖార అనే పాళీ పదానికి సంస్కృత రూపం సంస్కారం.

"https://te.wikipedia.org/w/index.php?title=ఖంధ&oldid=2963980" నుండి వెలికితీశారు