ఖలీఫా అల్ తజర్ మస్జిద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖలీఫా అల్ తజర్
మతం
అనుబంధంఇస్లాం
జిల్లాసయీద్ వీధి, డైరా.
Ecclesiastical or organizational statusమస్జిద్
ప్రదేశం
ప్రదేశందుబాయి
భూభాగందుబాయి
భౌగోళిక అంశాలు24°57′0″N 55°20′00″E / 24.95000°N 55.33333°E / 24.95000; 55.33333Coordinates: 24°57′0″N 55°20′00″E / 24.95000°N 55.33333°E / 24.95000; 55.33333
వాస్తుశాస్త్రము.
రకంMosque
శైలిఇస్లామిక్
పూర్తయినది2014
నిర్మాణ వ్యయం40 కోట్లు
సామర్థ్యం3500

ఖలీఫా అల్ తజర్ ప్రపంచంలోనే తొలిసారిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా నిర్మించిన హరిత మసీదు.

విశేషాలు[మార్చు]

రాత్రివేళ దుబాయి దృశ్యం
రాత్రివేళ దుబాయి దృశ్యం

మసీదు దుబాయిలోని దీరాలో గల సయీద్ స్ట్రీట్‌లో ఉంది. ఇది జూలై 19 2014 న ప్రారంభమైంది. ఈ మస్జిద్ దుబాయిలోని బర్ సయీద్ వీధి లో ఉన్నది. ఈ మసీదులో ఒకేసారి 3,500 మంది ప్రార్ధనలు చేసుకోవచ్చు. ఈ మసీదును దుబాయి ప్రభుత్వానికి చెందిన "ఆఖాఫ్ అండ్ మైనర్స్ అఫైర్స్ ఫౌండేషన్" 40 కోట్ల రూపాయల ఖర్చు చేసి నిర్మించారు. ఈ మసీదు 105,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడుకొని ఉన్నది. ఈ మసీదును హరితత్వం పెంపొందించుటకు పర్యావరణ సమతౌల్యం చేసే పదార్థాలతోనే నిర్మించారు. దీనిలో మసీదు 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన సామాగ్రితో నిర్మితమైనది. ఇతర మసీదులతో పోల్చితే ఈ మసీదులో నీరు, విద్యుత్ 19 శాతం వరకు తగ్గుతుందట. అమెరికా హరిత భవనాల మండలి ప్రమాణాలకు, మార్గదర్శకాలకు, దుబాయిలోని కొత్త చట్టాల నిబంధనలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. దీనిలో సౌర విద్యుత్ దీపాలు, నీరు వేడిచేసేందుకు సోలార్ హీటర్లు, కార్బన్ ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఏసీల వంటివి అమర్చారు. ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచేందుకు ఉష్ణ నిరోధక పదార్థాలను నిర్మాణంలో ఉపయోగించారు.


మూలాలు[మార్చు]

  • సాక్షి - 20-07-2014 - 16వ పేజి

ఇతర లింకులు[మార్చు]