గంగాపురం బాలకిషన్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగాపురం బాలకిషన్‌రావు

గంగాపురం బాలకిషన్‌రావు తెలంగాణ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందినవారు. అయితే ఆయన తండ్రి మహబూబ్‌నగర్‌కు విచ్చేయడంతో చిన్నప్పటి నుండే మహబూబ్‌నగర్‌లో ఉంటున్న ఆయన అప్పటి నిజాం సర్కార్‌లో ఉర్దూలో చదివారు. ఆ సమయంలోనే తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైంది. 1948 ఫిబ్రవరిలో రామనందతీర్థ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బాలకిషన్‌రావు రాంమందిర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి నిజాం ప్రభువుకు సవాల్ విసిరారు. దాంతో ఆయనను నిజాం సర్కార్ అరెస్టు చేసి జైలుకు పంపించింది. 1946లో నిజాం సర్కార్‌లో హోంమంత్రిగా కొనసాగుతున్న కాశీం రజ్విని నేరుగా ఎదుర్కొన్న ధీరుడు ఆయన. నిజాం ప్రభువు ఉస్మాన్ అలీఖాన్ సర్కార్‌లో కాశీం రజ్వి హోంమంత్రి హోదాలో మహబూబ్‌నగర్‌కు వచ్చి నప్పడు రైల్వేస్టేషన్‌లో రజ్విని నిలదీసి వెంటాడిన చరిత్ర కూడా బాలకిషన్‌రావుకు ఉంది. నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశాక బాలకిషన్‌రావుకు దేశంలోని అప్పటి ప్రముఖులు అప్పట్లో ఘన సత్కారం అందించారు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరణం[మార్చు]

ఆయన మే 14 2013 న మరణించాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]