గంగావతరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగావతరణం అనగా ఆకాశంలో ఉండే గంగ భూమికి దిగిరావడం. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేసి గంగను భూమిపైకి తెస్తాడు.

సగరులు[మార్చు]

సూర్యవంశపు రాజైన సగరునకు వర ప్రభావం వలన మొదటి భార్య కేశినికి మహాతెజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్య సుమతికి చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా ( లైక్ ఇంకుబేషన్ ) 60 వేల మంది కుమారులు కలిగిరి. వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు. కాని పెద్దవాడైన అసమంజశుడు తనతోపాటు ఆడుకోవదడానికి వచ్చే పిల్లలను సరయు నదిలో తోసివేయడం లేక వారి కొనప్రాణం వరకు నీటిలో ముంచి వారు తమ ప్రాణాలను కోసం పడే నరకయాతనను చూసి సంతోషపడే వాడు ఇది తెలిసిన ప్రజానీకం రాచబిడ్డడు అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పుటకు భయపడుతుండెడి వారు కానీ ఎంత వయసు వచ్చినను అంశుమంతుడి ప్రవర్తనలో ఎలాంటిమ మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అంసుమంతుడి ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు త కొడుకుకి రాజ్య బహిష్కారం శిక్ష విధించి నిష్పక్షపాతమైన, ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించుచుండెను.

సగరుని అశ్వమేధ యాగం[మార్చు]

ఆ తదుపరి కాలంలో మహారాజు తన రాజ్యా విస్తరణ కొరకు తన అశేష సేనా వహిని కాక తన 60 వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా అగుపించగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి వుండెను. కాని మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్రపదవికి పోటీ వస్తాడేమోనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళం లోని కపిల మహర్షి ఆశ్రంమంలో దాచాడు. ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించిననూ యాగాశ్వపు ఆచూకి దొరక లేదు. తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు. వీరి అత్యుత్సాహం భూదేవికి కడు ఖేదం కలిగించింది. కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగరుల పేరిట సాగరమైంది. పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతడెవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును తస్కరించి వుంటాడని భావించి, క్రుద్ధులై కపిల మహర్షి పైకి లంఘించారు. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేసాడు. మహర్షి కోపాగ్నికి 60 వేలమంది సగర పుత్రులు భస్మమై 60 వేల బూడిదకుప్పలై పోయారు.

భగీరథుని తపస్సు[మార్చు]

యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మథనపడుతున్న సగరునితో ఆంశుమంతుని మనవడు, దిలీపుని కొడుకు, సగర కులోద్భవుడు అయిన భగీరధుడు తన ప్రపితామహుని అనుమతి, ఆదేశాల మేరకు యాగాశ్వమును వెతుకుతూ వెళ్ళాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చట గల యాగాశ్వమును గుర్తించి, కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకొన్నాడు. అక్కడ పడివున్న బూడిద కుప్పలు తన పితామహులవని, మహర్షి కోపానికి బలియైనందున, వారికి ఉత్తమగతులు కలుగక ప్రేతములై అకలి దప్పులచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమగతులు లభించాలంటే దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసున్నాడు. తన పితామహులకు జలతర్పణలు విడిచి యాగాశ్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు.

తన పూర్వీకులకు ఉత్తమగతులు కలుగలేదనే చింత భగీరథుని వీడలేదు. రాజ్య పరిపాలనా బాధ్యతలను తన వంశజులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన విరించి భగీరధునికి ప్రత్యక్షమయ్యాడు. పాతాళలోకంలో వున్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను, అమరలోకవాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భువికేగే వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరధుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై తాను వాణీవిభుని సూచన మేరకు ఇలకేతెంచుటకు సిద్దమేనని, కానీ తను ఆకాశం నుండి క్రిందికి దూకినపుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బ్రద్దలవుతుందని చెప్పి, తనను భరించగలిగే నాధుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అంతట భగీరధుడు మరల బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత పునర్దర్శనమొసగి ఏమి వరము కావలెనని అడిగెను. సురగంగను భరించగలిగే నాధుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ పదునాలుగు భువనభాండమ్ములలో సురగంగను వహించగలిగే వాడు ఆమె అహమును అదుపుచేయగలిగిన వాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరధుడు పట్టువిడవక ఇనుమడించిన దీక్షతో మరియొక 10,000 సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసాడు. భగీరధుని తపస్సుకు మెచ్చినవాడై మహేశ్వరుడు దర్శనమొసగి, అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. చంద్రశేఖరుడు హిమత్ పర్వతాగ్రమున నిలచి తన ముడివైచి వున్న తన జటాజుటమును విదల్చి, ఓరకంట దివి నుండి భువిని బ్రద్దలుచేయగలనన్న అహముతో వున్న గంగను చూచి చిరుమందహాసం చేసాడు. తన నడుముపై చేతులను వుంచి నిలచిన శంకరుని పరిహాస దృష్టితో చూచిన గంగ, ఉత్తుంగ తరంగాలతో, వడితిరుగుతున్న సుడులతో, మహోగ్రధృతితో తనలోని మకరాలు, మీనాలు, కూర్మాలతో జలచరములన్నింటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కాలన్న తన తిక్కతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుని పైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించివేసాడు. గంగ ఆకాశం నుండి పడుతునే ఉంది శివుని జటలో తిరుగుతూనే వుంది వేల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క చుక్క గంగాజలమైనా ధరిత్రిపై చిందలేదు.

ఇంతటి తన శ్రమ తరువాత, భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవడాన్ని చూచిన భగీరధుడు, గంగను విడుచి, కరుణించమని కపర్దిని ప్రార్థించాడు. భక్తవరదుడైన భవుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధరిత్రిని చేరింది. గంగను చూచి సంతోషించిన భగీరధుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరధునితో నేను నీ వెంట నేను వచ్చేటపుడు నీవు వెనుతిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. అతంట మహదానందముతో భగీరధుడు ముందుకు సాగాడు. గంగ అతణ్ణి అనుసరించుచూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తనవేగాన్ని, పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరధుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమమును తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది. జహ్నుమహర్షి కుపితుడై తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తి చే ఔపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను ఆనుసరిస్తున్న జలధారల గలగల సవ్వడులు వినపడకపోయేసరికి వెనుతిరిగి చూచిన భగీరధుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగినది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధముల స్తుతించగా మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది.

మూలాలు[మార్చు]