గంగా మహల్ ఘాట్
స్వరూపం
గంగా మహల్ ఘాట్ | |
---|---|
ప్రదేశం | వారణాసి |
అక్షాంశ,రేఖాంశాలు | 25°17′23″N 83°00′23″E / 25.289675°N 83.006362°E |
ఉన్నతి | 72.35 |
నిర్మించినది | 1830 |
నిర్మాణం దేని కొరకు | బెనారస్ రాజ్యం కోసం |
నిర్మాణ శైలి | ఉత్తర ప్రదేశ్ శైలి |
పరిపాలన సంస్థ | వారణాసి నగర నిగం |
యజమాని | మహారాణి ట్రస్ట్ |
గంగా మహల్ ఘాట్ వారణాసిలో గంగా నదిపై ఉన్న ముఖ్యమైన ఘాట్‌లలో ఒకటి. 1830 లో నారాయణ్ రాజవంశీకులు నిర్మించిన ఈ ఘాట్, అస్సీ ఘాట్‌కు ఉత్తరాన ఉంది. వాస్తవానికి అస్సీ ఘాట్‌కు పొడిగింపుగా దీన్ని నిర్మించారు.[1][2][3][4]
చరిత్ర
[మార్చు]నారాయణ రాజవంశం, 1830 లో వారణాసిలో గంగా నది ఒడ్డున ఒక రాజభవనాన్ని నిర్మించింది. ఆ భవనాన్ని "గంగా మహల్" అని పిలిచేవారు. ఈ మహల్ ఉన్న ఘాట్‌కు "గంగా మహల్ ఘాట్" అని పేరు వచ్చింది. అస్సీ ఘాట్, గంగా మహల్ ఘాట్‌ల మధ్య రాతి మెట్లు మాత్రమే అడ్డ్డుగా ఉంటాయి. ఈ ప్యాలెస్‌లో హేమంగ్ అగర్వాల్ [5] డిజైన్ స్టూడియో ఉండగా, పై అంతస్తులను కార్ల్‌స్టాడ్ విశ్వవిద్యాలయానికి చెందిన "ఇండో-స్వీడిష్ స్టడీ సెంటర్" ఉపయోగిస్తోంది.[1][2][3][4]
స్థానం
[మార్చు]గంగా మహల్ ఘాట్, గంగానది ఒడ్డున ఉంది. ఇది వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఆగ్నేయంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]- వారణాసిలోని ఘాట్‌లు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ganga Mahal Ghat". Varanasi.nic.in. Retrieved 11 September 2015.
- ↑ 2.0 2.1 "Ghats of Varanasi". Varanasi.org. Retrieved 11 September 2015.
- ↑ 3.0 3.1 "About Ghats". kashiyana.com. Archived from the original on 9 August 2016. Retrieved 11 September 2015.
- ↑ 4.0 4.1 "The Varanasi Heritage Dossier". Wikiversity. Retrieved 11 September 2015.
- ↑ "Kashi in the closet". July 2016.
- ↑ "Location". Google Maps. Retrieved 11 September 2015.