Jump to content

గందరగోళం (నవల)

వికీపీడియా నుండి

కలువకొలను సదానంద, వృత్తి రీత్యా ఉపాధ్యాయులు, గొప్ప బాలసాహిత్య కర్తగా, శతాధిక గ్రంథకర్తగా పేరు పొందారు. సదానంద నవల, రూపకం, గేయం వంటి ప్రక్రియలన్నీటిలో సమర్ధవంతంగా రాశారు. చందమామ, బాల వంటి పత్రికలలో అసంఖ్యాకంగా రాశారు. పురాణాలను, చరిత్ర ను బాలలకు బోధపడేరీతిలో కథలుగా రాశారు.

వారి రచనల్లో 'గందరగోళం' నవలలో దేశపరిస్థితిని ఒక ప్రాథమిక పాఠశాల అధ్యాపకుని అనుభవాలతో వివరించారు. నవలలో ఒక సంఘటన. జనగణన(జనాభా లెక్కలు) సాగుతోంది. పంచాయితీ ఆఫీసు ఎదురుగా రోడ్డుపక్కన చెట్టుకు ఉయ్యాల కట్టి అందులో బిడ్డను పండబెట్టి ఆనీడలో కాపురం ఉన్న గూడులేని నిరుపేద యువదంపతుల పేర్లు టీచరు నమోదు చేసుకుంటాడు. అతనివెంట అతని చిన్న కుమారుడు. ఆబాబు అమాయకంగా పంచాయితీ ఆఫీసు గోడమీద రంగులలో రాసిన "చిన్న కుటుంబమే చింతలులేని కుటుంబం" అన్న ప్రకటన చదువుతాడు.

తర్వాత ఊళ్ళో ఒక సంపన్న తోళ్ళవ్యాపారి ఇంట్లో జనాభా లెక్కలు రాసుకుంటున్న దృశ్యం. ఉపాధ్యాయుడి కుమారుడు ఇక్కడా తండ్రికి సహాయంగా ఉంటాడు. ఆ వ్యాపారి భార్యలు, సంతానం, మనుమలు, మునిమనుమలు, పనివాళ్ళు ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసుకొనేసరికి భోజనం వేళవుతుంది. ఆ పిల్లవాడికి ఇంతపెద్ద కుటుంబం, వారి విలాసవంతమైన జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. పసివాడి దృష్టి నుంచి రచయిత దేశపరిస్థితిని వివరిస్తాడు. అంతా సవ్యంగా జరుగుతున్నదని నమ్మేవారికి ఈవైరుధ్యాలు అర్థంకాక అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఇప్పటికీ గొప్ప సామాజిక ప్రయోజనం కలిగిన మంచి నవల.


మూలాలు

[మార్చు]
  • సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.